జాతీయ వార్తలు

వర్తమాన సమస్యలపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌష్టికాహారం సహా దేశం ఎదుర్కొంటున్న వర్తమాన సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి) సొసైటీ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను చేర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని సరిదిద్దడం వంటి సమస్యలపై శాస్తవ్రేత్తలు దృష్టి సారించవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. దేశం నలుమూలల ఉండే విద్యార్థుల వద్దకు శాస్త్ర విజ్ఞానాన్ని తీసుకుపోయేందుకు ‘వాస్తవిక లాబ్స్’ (వర్చువల్ లాబ్స్)లను అభివృద్ధి చేయాలని ఆయన శాస్తవ్రేత్తలకు సూచించారు. విద్యార్థులను శాస్త్ర విజ్ఞానం వైపు ఆకర్షించాలి, తరువాతి తరంలో శాస్త్ర విజ్ఞాన చతురతను పటిష్టం చేసేందుకు కృషి జరగాలని ప్రధాన మంత్రి చెప్పారు. పరిశోధన, అభివృద్ధి పథకాలలో సహాయ, సహకారాల కోసం ప్రపంచంలోని వివిధ దేశాల్లోని పరిశోధనా సంస్థలు (లాబ్స్)లో పనిచేస్తున్న భారతీయ శాస్తవ్రేత్తల మధ్య సమన్వయం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 5జీ వైర్‌లెస్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, పునరుత్పాక ఇంధనం కోసం సరసమైన, ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీల తయారీ తదితర అంశాలపై శాస్తవ్రేత్తలు దృష్టి సారించాలని నరేంద్ర మోదీ చెప్పారు. సంప్రదాయ విజ్ఞానంతో ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని జోడించడం ద్వారా ప్రపంచ స్థాయి వస్తువులను తయారు చేయవలసిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. ఆవిష్కరణలను వాణిజ్యపరం చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన చెప్పారు. సగటు మనిషి జీవన ప్రమాణాలను పెంచేందుకు సీఎస్‌ఐఆర్ శాస్తవ్రేత్తలు కృషి చేయాలని మోదీ సూచించారు.
*చిత్రం...న్యూఢిల్లీలో శనివారం జరిగిన సీఎస్‌ఐఆర్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ