జాతీయ వార్తలు

గిరిజన వికాసం మన బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్దా (మధ్యప్రదేశ్): భారతదేశంలో నివసించిన తొలి తరం ప్రజలు గిరిజనులేనని, దాని దృష్ట్యా వారి సంస్కృతిని పరిపూర్ణమైన రీతిలో పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మాల్దా జిల్లాలోని రామ్‌నగర్‌లో శనివారంనాడు ఆదివాసీ మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. గిరిజనుల సంస్కృతిని పరిరక్షించడంతోపాటు వారి సమగ్ర వికాసానికి తోడ్పడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దీనిని ఓ రాజ్యాంగ బాధ్యతగా ప్రతిఒక్కరూ పరిగణించి గిరిజనుల సమగ్ర వికాసానికి కృషి చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన వెంకయ్యనాయుడు ‘ప్రకృతిలో ఎలా మమేకమై ఎలా జీవించాలో తమ స్ఫూర్తిదాయక జీవనం ద్వారా గిరిజనులు సమాజానికి తెలియజేస్తున్నారు. ఆ విశిష్ట లక్షణాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆదివాసీ మహోత్సవం గిరిజనుల సంస్కృతి, కళలు, విశిష్టమైన వారి జీవన పార్శ్వాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. గిరిజన సంస్కృతిని పరిరక్షించడానికి కేవలం ప్రభుత్వపరంగా కృషి చేస్తే సరిపోదని, మొత్తం సమాజం కూడా ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రగతి ద్వారాలు తెరుచుకునేది విద్యా వికాసం ద్వారానేనని స్పష్టం చేసిన ఆయన ఈ విద్యా సుమాలను గిరిజనుల ముంగిళ్లకు తీసుకురావాలని ఉద్ఘాటించారు. సుస్థిర శాంతియుత పరిస్థితులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమని పేర్కొ న్న ఆయన శాంతికి భంగం కలిగించకుండా దేశా న్ని ప్రగతిబాటలో పెట్టించాలని అన్నారు.
*చిత్రం...ఆదివాసీ మహోత్సవం సందర్భంగా శనివారం మాండ్లాలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, సర్ట్ఫికెట్లు పంపిణీ చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు