జాతీయ వార్తలు

చట్ట సవరణ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రాష్ట్రాలు కచ్చితంగా అమలుచేసేలా చట్ట సవరణ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న పొరపాటు మిగతా రాష్ట్రాల్లో పునరావృతం కాకుండా చట్ట సవరణ చేయాలని శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించలేదని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ముంబయిలో ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రిజర్వేషన్ల విధానానికి తూట్లు పొడుస్తున్నారు’అని ధ్వజమెత్తారు. అలాగే రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదని, వాటి అమలు విషయం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అంటూ ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. 2012 సెప్టెంబర్ 5న ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్ల అమలు విషయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదేనని పేర్కొంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజే కేంద్ర మంత్రి ఖర్గే సుప్రీం వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలనే రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిందని ఆయన అన్నారు. అందరికీ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని నీరుగార్చేలా న్యాయస్థానం తీర్పు ఉందని కాంగ్రెస్ నేత చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మునువాద సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని, ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్ల విధానాన్ని పాటించకపోవడమే దానికి ఉదాహరణగా ఖర్గే విమర్శించారు. రిజర్వేషన్లకు స్వస్తిచెప్పాలన్న యోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన వెల్లడించారు. రిజర్వేషన్ల అమలుకు అవరోధాలు ఎదురవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ వౌనం దాల్చడం దారుణమని ఖర్గే ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.