జాతీయ వార్తలు

అసమ్మతి.. ప్రజాస్వామ్య సేఫ్టీ వాల్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 15: అసమ్మతి అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక భాగమని, ఒకరకంగా చెప్పాలంటే ఇది ఓ సేఫ్టీ వాల్వ్ లాంటిదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. తమ అభిప్రాయాలతో ఏకీభవించని అసమ్మతి వర్గాలను జాతి వ్యతిరేకులుగా లేదా ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్ర వేయడం అన్నది రాజ్యాంగ విలువల పరిరక్షణ, సంప్రదింపుల ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతకరమని ఆయన అన్నారు. అహ్మదాబాద్‌లో శనివారం పీడీ దేశాయ్ సంస్మరణ ఉపన్యాసం చేసిన ఆయన మాట్లాడుతూ అసమ్మతిని అణచివేయడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించడం అన్నది ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుందని, దాని కారణంగానే చట్టాన్ని ఉల్లంఘించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తడం, వాటిని అణచివేయడానికి అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారాన్ని ఉపయోగించిన నేపథ్యంలో చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. అసలు అసమ్మతి అన్నది ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలాంటిదని, అలాంటపుడు దీనిని అణచివేయడానికి ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టించేందుకు జరిగే ప్రయత్నాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయని అన్నారు. అలాగే ఈ రకమైన చర్యలు రాజ్యాంగ విలువల నిబద్ధతకు కూడా విఘాతం కలిగిస్తాయని అన్నారు. అధికార యంత్రాంగానికి వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడానికి ఉపయోగించాలే తప్ప అసమ్మతిని అణచివేయడానికి కాదని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో చర్చల ప్రక్రియే ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, మైనారిటీ అభిప్రాయాలకు కూడా ఈ రకమైన ప్రక్రియ ద్వారా సముచితమైన గౌరవం, విలువ లభిస్తాయని అన్నారు. భారతీయత అన్న భావనపై ఏ ఒక్క వ్యక్తి లేదా ఏ ఒక్క వ్యవస్థ పూర్తి ఆధిపత్య ధోరణిని చెలాయించజాలదని ఆయన స్పష్టం చేశారు. హిందూ భారతదేశం లేదా ముస్లిం భారతదేశం అన్న వాదనను రాజ్యాంగ నిర్మాతలు తిరస్కరించిన విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గణతంత్ర భారతానికే రాజ్యాంగ నిర్మాతలు బలమైన ముద్ర వేశారని స్పష్టం చేశారు. ఆ విధంగా ప్రతిఒక్కరూ భారతీయుడు అన్న భావనతో పనిచేయడానికి దోహదం చేసే వ్యవస్థను రూపొందించే బాధ్యతను భావితరాల భుజస్కంధాలపైనే వారు ఉంచారని చంద్రచూడ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భావనకు భారతదేశం నిలువెత్తు నిదర్శనమని, ఈ ఉదాత్త లక్షణాలతోనే గొప్ప విజయాలను సాధించిందని తెలిపారు.