జాతీయ వార్తలు

వైరస్ లేకపోతే వచ్చే వారం డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: చైనా ప్రజలను కరోనా వైరస్ మహామ్మారి పట్టి పీడిస్తోంది. కాగా చైనాలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న 406 మంది భారతీయులు వెనక్కి అంటే హస్తినకు చేరుకున్నారు. ప్రస్తుతం వీరిని హర్యానాలోని మానేసర్ సైనిక శిబిరంలో దిగ్బంధంలో ఉన్నారు. వీరి రక్తం శాంపిల్స్‌ను వైద్య పరీక్షలు పంపించడం జరిగింది. వైరస్ లేదని నిర్థారణ అయితే ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు పంపించయడం జరుగుతుంది. ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ)లు వీరి రక్తం శాంపిల్స్‌ను శుక్రవారం తీసుకెళ్ళారు. రక్త పరీక్షల నివేదిక సోమవారం వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఎటువంటి వైరస్ లేదని తేలితే వారిని సైనిక క్యాంపు నుంచి విడుదల చేస్తారు. ఈ నెల 1, 2 తేదీల్లో చైనాలోని వూహాన్ నుంచి 650 భారతీయులను ఏయిర్ ఇండియా విమానంలో వెనక్కి తీసుకుని రావడం జరిగింది. కాగా వీరిలో 406 మందిని ఐటీబీపీ దిగ్బంధం చేసింది. దీంతో వారిని హర్యానాలోని సైనిక క్యాంపులో ఉంచారు. ఐటీబీపీకి చెందిన వైద్య నిపుణులు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరంలో ఉన్న వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. శిబిరంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులేమీ కనిపించడం లేదని, వారంతా ఎప్పటిలా ఆరోగ్యంగా ఉన్నారని, రోజూ వారీలా ఆహారం తీసుకుంటున్నారని ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే తెలిపారు. వారికి అవసరమైన సౌకర్యాలు, ఔషధాలు కల్పించడం జరిగిందని ఆయన వివరించారు.