జాతీయ వార్తలు

ధన్యవాద్ ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి మూడోసారి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదవీ స్వీకార ప్రమాణాన్ని చారిత్రక రామ్‌లీలా మైదాన్ అన్ని హంగులతో ముస్తాబవుతోంది. ఆదివారం జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఈ మైదానాన్ని ముస్తాబు చేయడం కోసం ఇటు అధికారులు, అటు కార్యకర్తలు అహరహం కృషి చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ మొదలుకుని భద్రతా ఏర్పాట్ల వరకు అన్నింటిపైనా అధికారులు దృష్టి పెట్టారు. మైదానం అంతటా కూడా 'ధన్యవాద్ ఢిల్లీ’ బ్యానర్లు వెలిశాయి. మొత్తం ప్రజలందరికీ ఆహ్వానం అన్నట్టుగా కేజ్రీ ప్రమాణ స్వీకారం కోసం ఈ మైదానాన్ని అన్నివైపుల నుంచి తెరుస్తారు. వరుసగా మూడోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం ఇటు పార్టీ నేతల్లోను, ఇటు కార్యకర్తల్లోనూ ఎనలేని ఉత్సాహానికి కారణమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వివిధ రంగాలకు చెందిన 50 మంది వ్యక్తులు ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో కేజ్రీవాల్‌తోపాటు వేదికను అలంకరించే అవకాశం ఉంది. వీరిలో అధ్యాపకులు, వాస్తు నిర్మాణ నిపుణులు, ఆప్తులను కోల్పోయిన అగ్నిమాపక దళ కుటుంబీకులు ఉన్నారని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇది పూర్తిగా ఢిల్లీ కేంద్రకంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను లేదా రాజకీయ నాయకులను ఆహ్వానించలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి చర్చించేందుకు కేజ్రీవాల్ శనివారం రాత్రి కాబోయే మంత్రులతో విందు సమావేశం జరిపారు. ముఖ్యంగా రానున్న మూడు నెలలను లక్ష్యంగా చేసుకుని ఆలోగా సాధించదలచుకున్నవాటిపై దృష్టి సారించారు.
గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాస్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్‌లను మళ్లీ మంత్రులుగా తీసుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా రెండు వేల నుంచి మూడు వేల మంది సిబ్బందిని మోహరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమంపై ఏరియల్ నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఫలితాలు వెలువడిన రోజు కేజ్రీవాల్ తరహాలో మఫ్లర్ ధరించి ప్రతిఒక్కర్నీ అలరించిన ఆవ్యన్ తోమర్ అనే బాలుడు ఈ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆహ్వానితునిగా నిలవబోతున్నాడు. ఆ బాలుడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
*చిత్రం...ఆప్ నేతలతో కేజ్రీవాల్ సమావేశం