జాతీయ వార్తలు

ట్రంప్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 15: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తున్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 24,25 తేదీల్లో ట్రంప్ వస్తున్నారు. ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తగా రోడ్‌షో నిర్వహిస్తారు. ట్రంప్ పర్యటన కోసం 25 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 10వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు. మోటేరాలో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంకు ట్రంప్ ప్రారంభోత్సవం చేస్తారు.
మోదీ-ట్రంప్ రోడ్ షోకు 65 సహాయ పోలీసు కమిషనర్లు, 200 మంది ఇన్స్‌పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను నియమించనున్నారు. అహ్మదాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డిప్యూటీ పోలీసు కమిషనర్(కంట్రోల్ రూం) విజయ్ పటేల్ వెల్లడించారు. పదివేల పోలీసుల మోహరింపే కాకుండా అదనంగా యునైటెడ్ స్టేట్స్ సీక్రేట్ సర్వీసు అధికారులు, నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) అధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ) అధికారులు తరలిరానున్నారు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన 22 కిలోమీటర్లు సాగుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పర్యటన మొదలై సబర్మతి ఆశ్రమం వరకూ సాగుతుంది. అక్కడి నుంచి మోటేరా స్టేడియంకు ఇందిరా బ్రిడ్జిమీదుగా పర్యటన ఉంటుందని పటేల్ స్పష్టం చేశారు. అగ్రనేతల పర్యటన సాగే మార్గమంతటా యాంటీ స్నైపర్ టీమ్ మోహరిస్తుంది. ఇప్పటికే బాంబు డిటెక్షన్, డిస్పోజల్ బృందాలు, పోలీలు ఆ మార్గంమంతటా జల్లెడ పట్టాయి. హోటళ్లు, అతిధి గృహాల్లో సందర్శకుల రాకపోకలపై పోలీసులు దృష్టి సారించారు. దీని కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నాక దాని చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర, ఆ ప్రాంత గొప్పతనాన్ని ప్రధాని మోదీ స్వయంగా వివరిస్తారని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అధినేతలిద్దరూ కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంకు వెళ్తారు. ట్రంప్ పర్యటన కోసం లక్షా పది వేల మంది అతిధులు తరలివస్తున్నారు. వారందరికీ ఆహ్వానాలు పంపారు.
అలాగే స్టేడియం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథులకు సంబంధించి పూర్తి సమాచారం పోలీసులు సేకరించారు. ఇలా ఉండగా ట్రంప్, మోదీ పర్యటన సాగే మార్గంలో ఎలాంటి అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వహించవచ్చదని పౌరులకు డీసీపీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించి సహకరించాలని ఆయన కోరారు.