జాతీయ వార్తలు

కర్నూలులోనే హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న మంత్రివర్గం నిర్ణయం, శాసన సభ ఏకగ్రీవ తీర్మానం మేరకు హైకోర్టును వీలున్నంత త్వరగా కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాన్‌కు స్పష్టం చేశారు. అలాగే శాసన మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కోరారు. జగన్ శనివారం మధ్యాహ్నం రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్ర హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం గురించి చర్చించారు. హైకోర్టును త్వరగా కర్నూలుకు మార్చాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాజధాని కార్యకలాపాలను
వికేంద్రీకరించటంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన రవిశంకర్ ప్రసాద్‌తో చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హై కోర్టును ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ 2019 నాటి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ఆలోచన అని జగన్ ఆయనతో చెప్పటం గమనార్హం. ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను శాసన మండలి అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. దీని వల్ల ప్రజాసామ్యం అపహాస్యమవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లులను అడ్డుకుంటున్న నేపథ్యంలోనే తమ ప్రభుత్వ శాసన మండలిని రద్దు చేయాలని సిఫారసు చేసిందంటూ ‘శాసన సభ తీర్మానం మేరకు వీలున్నంత త్వరగా శాసన మండలిని రద్దు చేయాలి’అని ఆయన రవిశంకర్ ప్రసాద్‌కు సూచించారు. శాసన సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసన మండలిని రద్దు చేయాలనే సిఫార్సు చేసిందని జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. కాగా మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం గురించ రవిశంకర్ ప్రసాద్‌కు వివరించిన జగన్‌మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని వీలున్నంత త్వరగా అమలులోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. కాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను వీలున్నంత త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మొదట రవిశంకర్ ప్రసాద్‌కు శాలువ కప్పి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రితో ఫోటోలు దిగిన రవిశంకర్ ప్రసాద్ ఆ తరువాత వైసీపీ ఎంపీలను తన చాంబర్‌లోకి ఆహ్వానించి వారితో పాటు ఒక గ్రూపుఫోటోదిగటం గమనార్హం.
*చిత్రం... ఢిల్లీ సంచార్ భవన్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి