జాతీయ వార్తలు

పేదల వ్యతిరేక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజంగఢ్ (యూపీ): కేంద్ర సర్కారు పేదల, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఎంతో పట్టు ఉన్న ఆజంగఢ్ ప్రాంతంలో బుధవారం ఆమె పర్యటించారు. సీఏఏ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొని అరెస్టయిన వారి కుటుంబీకులను కలిసి సంఘీభావం ప్రకటించారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఈ నియోజకవర్గం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆమె విమర్శించారు. మరోవైపు కేంద్రం పేదలు, ప్రజల అభీష్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని అన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేసి జైళ్ళకు పంపిస్తున్నప్పటికీ, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ యాదవ్ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత వారం ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన మహిళలపై పోలీసులు విరుచుకుపడడం అత్యంత దారుణమని ఆమె మండిపడ్డారు. 135 మందిపై కేసులు నమోదు చేసి వారిని జైళ్ళలోకి నెట్టారని ఆమె అన్నారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ‘మీకు అన్యాయం జరిగింది, మనమంతా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి’ అని ఆమె సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నందుకు అరెస్టుయిన వారి కుటుంబీకులనుద్ధేశించి పిలుపునిచ్చారు. కేంద్ర నిర్ణయాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆమె దుయ్యబట్టారు. ప్రజావసరాలను గుర్తించి, స్పందించి, సహాయ సహకారాలను అందించాల్సిన అఖిలేష్ యాదవ్ కనబడుట లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేష్ యాదవ్ ఇక్కడి ప్రజలకు చేసిన సేవలు ఏమీ లేవన్నారు. కాంగ్రెస్ యూపీ శాఖ మైనారిటీ సెల్ నాయకుడు నజీం జావెద్ మాట్లాడుతూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రియాంక దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై ఆమె స్పందిస్తూ మహిళలను కూడా పోలీసులు వేధిస్తున్నారని, వారిపై దమనకాండ కొనసాగుతున్నదని అన్నారు. ‘నేను బిజ్నూరు, మీరట్, ముజాఫర్‌నగర్, లక్నో, వారణాసి తదితర ప్రాంతాల్లో పర్యటించాను. ఆయా ప్రాంతాల్లో పోలీసులు సాగిస్తున్న అకృత్యాలను, అధికారులు చేస్తున్న అరాచకాలను గుర్తించాను. నేను గమనించిన అంశాలన్నింటినీ క్రోఢీకరించి జాతీయ మానవ హక్కుల (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశాను. ఆజంగఢ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తీసుకెళతాను’ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే సహాయ, సహకారాలను అందించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆమె తెలిపారు.
*చిత్రం...ఆజాంగఢ్‌లోని బలారీయాగంజ్‌లో బుధవారం ఓ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ