జాతీయ వార్తలు

నర్మదా కుంభమేళాలో ‘గోద్రా’ దోషుల సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబల్‌పూర్, ఫిబ్రవరి 12: గోధ్రా అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులు నర్మదా కుంభమేళాలో సామాజిక కార్యకర్తలుగా సేవలందించనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 24న ప్రారంభం కానున్న నర్మదా కుంభమేళాలో సేవలందించనున్నట్లు అధికారులు బుధవారం తెలియజేశారు. 2002 సంవత్సరంలో జరిగిన గోద్రా అల్లర్లలో 23మంది సజీవ దహనం కేసులకు సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో 15మందికి సుప్రీంకోర్టు గత నెలలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, జబల్‌పూర్‌లలో స్వచ్ఛంద కార్యకర్తలుగా పనిచేసే షరతుపై వీరికి బెయిల్ మంజూరైంది. ఈమేరకు వీరు రెండు గ్రూపులుగా వీరు మధ్యప్రదేశ్‌కు మంగళవారం వచ్చారు. వీరిలో ఏడుగులు జబల్‌పూర్‌కు రాగా.. ఆరుగులు ఇండోర్‌కు వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీరంతా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సామాజిక సేవతో పాటు ధ్యానం, ఆధ్యాత్మిక, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ బృందంలో ఏడుగురు దోషులు జబల్‌పూర్‌కు మంగళవారం రాత్రి వచ్చారని ఈనెల 24 నుంచి మార్చి మూడో తేదీ వరకు జరిగే నర్మదా కుంభమేళాలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ రాష్ట్రానికి చెందిన లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గిరిబాల సింగ్ పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళాలో స్వచ్ఛ్భారత్ అభియాన్, ఓల్డేజ్ హోంలు, రోగులకు సేవలు, ఆసుపత్రుల్లోనూ సేవలందించనున్నారని చెప్పారు. ‘సమాజ సేవ చేస్తున్నాం’ అనే భావన వారిలో కల్పించడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.