జాతీయ వార్తలు

మీ సహకారం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం, రాష్ట్ర రాజధానిని అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేయడం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాభివృద్ధ్ది కోసమే రాజధానిని ఒకే చోట ఏర్పాటు చేసే బదులు మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రధానితో చెప్పారు. శాసన మండలి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ఆడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన రూ.55,549 కోట్ల అంచనాలకు పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే ఇవ్వటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రావలసిన 3,320 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయించాలని జగన్ ప్రధాని మోదీకి విజప్తి చేశారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జగన్ కలిసి రాష్ట్ర సమస్యల గురించి దాదాపు గంటన్నర పాటు చర్చించారు. శాసన మండలి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే బిల్లులను అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కార్యకలాపాలకు అడ్డుపడుతున్నందుకే రాష్ట్ర శాసన సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో శాసన మండలి రద్దుకు సిఫారసు చేసిందని ఆయన నరేంద్ర మోదీకి వివరించారు. శాసన మండలిని రద్దు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖను ఆదేశించాలని జగన్ ప్రధాని మోదీకి విజప్తి చేశారు. రాష్ట్భ్రావృద్ధ్ది కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు. జగన్ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పది అంశాలతో కూడిన ఒక వినతిపత్రాన్ని నరేంద్ర మోదీకి ఆందజేశారు. మార్చ్ 25 తేదీ ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చేపడుతున్న కార్యక్రమానికి రావాలని ఆయన నరేంద్ర మోదీని కోరారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రికి వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని, ఈ మేరకు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలను ఆదేశించాలని ఆయన నరేంద్ర మోదీని కోరారు. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసే దిశగా పనులు చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ ఆర్ కోసం 33,010 కోట్ల రూపాయలు అవసరమవుతోంది అని ఆయన ప్రధాని దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలు 55,549 కోట్ల రూపాయలకు వీలున్నంత త్వరగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయించాలి, ఇందు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రం అభివృద్ధ్ది చెందాలంటే ప్రత్యేక హోదా ఏంతో అవసరం కాబట్టి వీలున్నంత త్వరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ విజప్తి చేశారు. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి ఇంకా రావలసిన రూ.18,969 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు రామాయం పట్నం పోర్టు నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయించినా ఇంత వరకు కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని మిగతా పదిహేను
వందల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రదానిని కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలన్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్‌మోహన్ రెడ్డి ప్రధానికి విజప్తి చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాభివృద్ధి కోసమే అధికారం, రాజధానిని వికేంద్రీకరిస్తున్నామని జగన్ ప్రధాని మోదీతో చెప్పారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామని ఆయన నరేంద్రమోదీతో చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తీసుకుని శాసన సభలో పెట్టి అనుమతి తీసుకున్నామని జగన్ ప్రధాని మోదీకి వివరించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం, సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికి ఆమోదం తెలపాలని కూడా ఆయన ప్రధానిని కోరారు.
*చిత్రం...ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్ నివాసంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ తర్వాత వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి