జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు ఈయూ పార్లమెంటరీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 12: రెండు రోజుల పర్యటన నిమిత్తం యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ బృందం బుధవారం శ్రీనగర్ చేరుకుంది. 25 మంది సభ్యులు గల ఈ బృంద సభ్యులు తొలుత దాల్ లేక్‌లో షికార్లు చేశారు.
15 మంది సభ్యులతో కూడిన మొదటి బ్యాచ్ ఇదివరకే జమ్మూకాశ్మీర్‌లో పర్యటించగా, రెండో బ్యాచ్ శ్రీనగర్ విమానాశ్రయానికి బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో చేరుకుంది. షెడ్యూలు ప్రకారం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో ఈ బృందం పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో దాల్ లేక్‌లో షికార బోటులో కొద్ది సేపు విహారం చేశారు. అనంతరం వీరు తమకు కేటాయించిన వసతి గృహాలకు చేరుకున్నారు. ఈయూ పార్లమెంటరీ బృందాన్ని జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించేందుకు కేంద్రం అనుమతించడంపై ప్రతిపక్ష పార్టీలన్నీ భగ్గుమన్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగు పెట్టనీయకుండా నిర్భంధాలు సృష్టిస్తూ విదేశీ బృందాలకు స్వాగతం పలకడం అత్యంత దారుణమని కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ధ్వజమెత్తాయి. జమ్మూకాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు ఇతర పార్టీల నాయకులను గృహ నిర్భంధంలో ఉంచిన ప్రభుత్వం విదేశీయులను ఏ విధంగా అనుమతిస్తుందో అర్థం కావడం లేదని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కాబట్టి ఈయూ బృందం పర్యటన వల్ల నష్టమేమీ ఉండదని కేంద్రం వ్యాఖ్యానిస్తున్నది. పైగా ఇది గతంలోనే ఖరారైన షెడ్యూలు ప్రకారం ఈ బృందం పర్యటిస్తున్నదని కేంద్రం వివరణ ఇచ్చింది.

*చిత్రం... శ్రీనగర్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బృందంకాశ్మీర్‌కు ఈయూ పార్లమెంటరీ బృందం