జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీ డేటాపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: అస్సాంలో జాతీయ పౌర రిజిస్ట్రీ(ఎన్‌ఆర్‌సీ) వ్యవహారాలు పర్యవేక్షించిన ఐటీ దిగ్గజం విప్రో కాంట్రాక్ట్ పునరుద్ధరించలేదు. ప్రాజెక్టు 2019 అక్టోబర్‌తో ముగిసినా సర్వీసుల పునరుద్ధరణ జరగలేదని కంపెనీ బుధవారం వెల్లడించింది. 2014లో అస్సాంలో ఎన్‌ఆర్‌సీ ప్రాజెక్టును ఐటీ దిగ్గజం విప్రోకు కేంద్రం అప్పగించింది. అయితే ఒప్పందం గత ఏడాది అక్టోబర్‌తో ముగిసినా పునరుద్ధరించడం జరగలేదని బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న విప్రో ప్రకటించింది. జనవరి వరకూ ఎలాంటి ఫీజు లేకుండా సర్వీసు లు అందించినట్టు ఈ-మెయిల్ ప్రకటనలో పేర్కొంది. ఒప్పందం పునరుద్ధరిస్తే సేవలు అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కంపెనీ వెల్లడించింది. అస్సాం ఎన్‌ఆర్‌సీ ప్రాజెక్టు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో నడిచింది. ఎన్‌ఆర్‌సీకి సంబంధించి సాంకేతిక సహకారం, రూపకల్పన విప్రో అందజేసింది. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ డేటా భద్రంగా ఉందని, ఎక్కడైనా సాంకేతిక సమస్యలున్నా త్వరలోనే పరిష్కరించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటలకే కాంట్రాక్టుపై విప్రో స్పందించడం గమనార్హం. ‘ఐటీ కాంట్రాక్టును గడువుముగిసింది. 2019 అక్టోబర్‌కే గడువుపూర్తయింది. ఇరువురి మధ్య ఉన్న సహృద్భావ సంబంధాల రీత్యా 2020 జనవరి వరకూ సేవలు అందించాం’అని ఐటీ దిగ్గజం విప్రో వెల్లడించింది. అయితే బకాయిలు, పలు సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు జరుగుతున్నాయన్న మాత్రం కంపెనీ చెప్పలేదు. అస్సాం ఎన్‌ఆర్‌సీకి సంబంధించి పూర్తి వివరాలు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఆర్‌సీఏఎస్‌ఎస్‌ఎస్‌ఏఎం.ఎన్‌ఐసీ.ఇన్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2019 ఆగస్టు 31న తుది జాబి తా ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా ఉంచినా గత కొద్ది రోజులుగా డేటా అందుబాటులోలేదు. సాంకేతిక సమస్య తలెత్తి వెబ్‌సైట్ పనిచేయడం లేదని తెలిసింది. అయితే డేటా దొరక్కపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. జాబితాలో పేర్లు లేనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి ఇప్పటి వరకూ తిరస్కరించినట్టు ధృవీకరణ పత్రాలు అందలేదు. పరిస్థితి గమనించిన హోమ్ మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ‘సాంకేతిక సమస్య తలెత్తింది. అందువల్లే డేటా అందుబాటులో లేదు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం’అని హోమ్‌మంత్రిత్వశాఖ ప్రతినిధి ప్రకటించారు. విప్రోతో కాంట్రాక్టు పునరుద్ధరణ కాకపోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. ఇదే విషయంపై ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హితేష్ దేవ్ శర్మ మాట్లాడుతూ ‘డేటా ఆఫ్‌లైన్‌లో ఉంది. అందుకే అందుబాటులోలేదు.
రెండు మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది’అని చెప్పారు.