జాతీయ వార్తలు

మోదీ కృషితో ప్రగతి పథంలో భారత్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల మూలంగా దేశం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు ముందుకు సాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంపై విమర్శలు గుప్పించారు. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి దేశ ఆర్థిక వ్యవస్థ కంటే తమ హయాంలో దేశం ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగున్నదని ఆమె అన్నారు. చిదంబరం రాజ్యసభలో బడ్జెట్‌పై మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అసమర్థ వైద్యుడి చేతులో ఉన్నది, త్వరలోనై ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు పోతుందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కాగా నిర్మరా సీతారామన్ తన ప్రసంగంలో చిదంబరం విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తప్పుడు పరిష్కార మార్గాలను చూపించిన వారి నుంచి తనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగారు. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశం నుంచి పలాయనం చిత్తగించాయని, రుణాలు చెల్లించకుండా బ్యాంకులను మోసం చేసిన వారు కూడా దేశం విడిచి పారిపోయారని ఆమె విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఏడు రకాల చర్యలతో పటిష్టం చేస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన వారి చేతల్లోనే ఉన్నదన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి, ఆరు నెలల్లో జీఎస్‌టీ పన్నుల కలెక్షన్ ఒక లక్ష కోట్లు దాటింది, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్‌లు పుంజుకుంటున్నాయని ఆమె వివరించారు. మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతోందని, రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వస్తున్నారన్నారు. అభివృద్ది, ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు రిజర్వు బ్యాంకు సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2008-09లో అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకు యుపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల కంటే ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో మెరుగని ఆమె స్పష్టం చేశారు. వృద్ధిని సాధించేందుకు గత సంవత్సరం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 135 బేస్ పాయింట్లను తగ్గించడానికి తమ ప్రభుత్వమే కారణమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతోందని ఏడు మైక్రో ఎకనమిక్ ఇండికేటర్స్ సూచిస్తున్నాయని ఆమె చెప్పారు. నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సమాధానం ఇచ్చిన తరువాత రాజ్యసభలో కూడా బడ్జెట్ చర్చకు బదులిస్తూ మరోసారి చిదంబరంపై దాడికి దిగారు. ఆర్థిక వ్యవస్థను బాగుపరిచేందుకు తప్పుడు పరిష్కారాలు చూపించడం లేదని ఆమె చిదంబరంపై ధ్వజమెత్తారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బాగు పరిచేందుకు తప్పుడు పరిష్కార మార్గాలను సూచించారని ఆమె పరోక్షంగా ఆరోపించారు. 2008-09లో దేశ ఆర్థిక వ్యవస్థను బాగు పరిచేందుకు అవలంభించిన పరిష్కార మార్గాలేమిటి? అవి ఇచ్చిన ఫలితాలేమిటి అంటూ ఆమె చిదంబరంపై విమర్శలు గుప్పించారు. చిదంబం హయంలో రుణాలు తీసుకున్న వారు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారని ఆమె ఆరోపించారు. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిని స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ తీసుకుంటున్న పలు చర్యల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.
*చిత్రం...లోక్‌సభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్