జాతీయ వార్తలు

తెలంగాణకు అప్పులు పెరిగాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014-15 సంవత్సరంలో మిగులు రెవెన్యూ ఉన్న తెలంగాణకు ఆ తరువాత క్రమంగా అప్పులు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. తెలంగాణా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు సందేహాస్పదంగా ఉన్న విషయం తమకు తెలియదని ఆమె తెలిపారు. 2014-15 నుండి 2019-20 వరకు పెరుగుతున్నా, ఇది 14వ ఆర్థిక సంఘం సూచించిన పరిధిలోనే ఉన్నదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మధ్యతరహా ఫిస్కల్ పాలసీ పరిధిలో కూడా ఉన్నదని నిర్మలా సీతారామన్ తమ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. తెలంగాణకు గత ఆరు సంవత్సరాల్లో పన్నుల వాటా కింద 85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద 1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద 8460 కోట్లు, వెనుకబడిన జిల్లాల ప్రత్యే క సహాయం కింద 1,916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుండి 43,853 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 51,036.27 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి 1,500.54 కోట్ల రూపాయ లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. వీటితోపాటు ప్రత్యేక సహయం, వ్యవసాయం, పౌర విమానయాన శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, హోం శాఖ, కార్మిక, ఉపాథి కల్పన, న్యాయ శాఖ, రోడ్లు, భవనాలు, గిరిజన సంక్షేమం తదితర శాఖల పద్దుల కింద కూడా నిధుల కేటాయింపు జరిగిందని ఆమె తెలిపారు.
*చిత్రం...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్