జాతీయ వార్తలు

మిషన్ భగీరథ, కాకతీయకు రూ.24,205 కోట్లు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరద పథకానికి 19205 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు, రెండింటికి కలిపి మొత్తం 24,205 కోట్లు కేటాయించాలని లోకసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నామా నాగేశ్వరరావు సోమవారం లోకసభలో 2020-21 బడ్జెట్‌పై మాట్లాడుతూ మిషన్ భగీరదకు నిధులు కేటాయించాలని తాము ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ఆయన నిలదీశారు. మిషన్ భగీరదకు నిధులు కేటాయించాలని నాలుగు సంవత్సరాల నుండి కోరుతున్నాము అయినా మీరు పట్టించుకోవటం లేదు కానీసం ఇప్పుడైనా లోకసభ సాక్షిగా తాను చేస్తున్న విజప్తి మేరకు ఈ పథకానికి నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణాలోని అన్ని చెరువులను అభివృద్ది చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. వరంగల్-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్దిని వెంటనే చేపట్టాలన్నారు. నేషనల్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుతోపాటు నదుల అనుసంధానం చేపట్టాలని నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే దేశం అభివృద్ది చెందుతుందనేది మరిచిపోరాదని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

*చిత్రం... ఎంపీ నామా నాగేశ్వరరావు