జాతీయ వార్తలు

ఆంధ్రలో రూ.15 వేల కోట్ల అంచనాతో 18 జాతీయ రహదారుల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వై.సి.పి పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు గడ్కరీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్దితోపాటు మరో పదివేల కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరసల దారుల అభివృద్ది, కనెక్టివిటీ, రోడ్డు ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి సంబంధించిన 38 ప్రాజెక్టులను చేపట్టినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ చేపట్టగా మిగతా 38 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన పి.డబ్ల్యు.డికి అప్పగించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. జాతీయ రహదారుల పనులు ఈ సంవతసరం పూర్తి కావలసి ఉన్నదని గడ్కరీ తెలిపారు. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుండి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల అరువరుసల బైపాస్ రహదారి పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. గొల్లపూడి నుండి చిన అవుటపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర ఆరు వరసల బైపాస్ రోడ్డు వలన విజయవాడ నగరంపై ట్రాపిక్ భారం చాలా వరకు తగ్గుతుందన్నారు.
రిషికొండ బీచ్‌కు మహర్దవ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఎన్నిరాన్‌మెంట్, ఈస్థటిక్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రాజెక్టులో రిషికొండ బీచ్‌కు స్థానం దక్కినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావ్డేకర్ తెలిపారు. ప్రకాశ్ జావ్డేకర్ సోమవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని రక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దేశంలోని కోస్తా తీరం ఉన్న రాష్ట్రాలలోని 13 బీచ్‌లను గుర్తించాము, ఇందులో రిషి కొండ బీచ్ కూడా ఉన్నదని ఆయన చెప్పారు. పర్యావరణ బీచ్‌లలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. భద్రత కోసం ప్రత్యేక గార్డులను ఏర్పాటు చేయటంతోపాటు సి.సి.టి.వి క్యామెరాలను కూడా ఏర్పాటు చేస్తారని జావ్డేకర్ చెప్పారు.