జాతీయ వార్తలు

సుప్రీం తీర్పుపై కేంద్రం అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలన జరుపుతోంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సముచిత నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ప్రకటించారు. తావర్ చంద్ గెహ్లాట్ సోమవారం లోక్‌సభలో సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం తరపున ఒక ప్రకటన చేస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ, వెనుకబడిన కులాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని హామీ ఇచ్చారు. ‘సుప్రీం కోర్టు ఈ నెల 7న ఉత్తరాఖండ్ ప్రభుత్వం వర్సెస్ ముఖేష్ కుమార్, ఇతరుల కేసులో తీర్పు ఇస్తూ రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ తీర్పు ఇచ్చింది, ఇది అత్యంత ముఖ్యమైన విషయం, కేంద్ర ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని అత్యంత ఉన్నత స్థాయిలో దీనిపై చర్చలు జరుపుతోంది, లోతుగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. ఆయన తన సమాధానం కొనసాగిస్తూ ‘సుప్రీం కోర్టు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కక్షిదారుగా చేర్చలేదు, పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించలేదు, ఉత్తరాఖండ్‌లో 2012లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, తమ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని, సుప్రీం కోర్టు తీర్పుపై లోతుగా ఆలోచించిన తరువాత ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుంది’ అని గెహ్లాట్ ప్రకటించారు. అయితే తావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షం సభ నుండి వాకౌట్ చేసింది. అంతకు ముందు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, జీరో అవర్‌లో సుప్రీం కోర్టు తీర్పుపై అధికార పక్షం, ప్రతిపక్షానికి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి నుంచి ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉండడం మరిచిపోరాదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ బదులిస్తూ 2010లో ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను తొలగిస్తూ ఒక ఆదేశం జారీ చేసింది, ఈ ఆదేశానికి వ్యతిరేకంగా కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఈ తీర్పు వచ్చిందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీని తప్పు పట్టడం అన్యాయమని ఆయన వాదించారు. ఇప్పుడు కేంద్రంతో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా అధికారంలో ఉన్నది కాబట్టి దీనికి మీరే బాద్యత వహించాలని కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్‌రంజన్ చౌదరి, డీఎంకే సభ్యుడు ఏ. రాజా తదితరులు డిమాండ్ చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డీఎంకే సభ్యుడు రాజా డిమాండ్ చేశారు. లోక్ జనశక్తి పార్టీ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుతవం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నదని ప్రకటించారు. రిజర్వేషన్లలో ప్రమోషన్లను తొలగించినప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలను మూడు రోజుల పాటు పొడిగించి సానుకూల నిర్ణయం తీసుకోవడం మరిచిపోయారా? అని ఆయన ప్రతిపక్షాన్ని నిలదీశారు. ఎస్‌సీ, ఎస్‌టీ. బీసీల రిజర్వేషన్లపై ఇకమీదట ఎక్కడ ఎలాంటి కేసు దాఖలు కాకుండా చూసేందుకు ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదివ షెడ్యూలులో చేర్చాలని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఏ.రాజా కూడా ఈ డిమాండ్ చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్ల వ్యవహారం అత్యంత సున్నితమైంది, దీనిని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని జేడీయు సభ్యుడు ఆరోపించారు. అప్నాదళ్ అనుప్రియ పాటిల్ మాట్లాడుతూ రిజర్వేషన్లపై ఇక మీదట ఎలాంటి గొడవ జరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లోట్ సుప్రీం కోర్టు తీర్పుపై ఓక ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే ప్రతిపక్షం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా గొడవ చేసింది. ప్రభత్వానికి వ్యతిరేకగా నినాదాలు ఇస్తూ బీజేపీ ప్రభుత్వ రిజర్వేషన్లను తొలగించాలనుకుంటోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.