జాతీయ వార్తలు

మనవాళ్లని స్వదేశానికి తరలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా వైరస్‌కు కేంద్రమైన చైనాలోని వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన కర్నూలుకు చెందిన అనె్నం జ్యోతికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. జ్యోతితో పాటు చైనాలోని వుహాన్, ఇతర నగరాల్లో చిక్కుకున్న భారతీయులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందజేస్తున్నాం, వారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రశాంత్ కుమార్ సోనా సోమవారం అనె్నం జ్యోతి తల్లి అనె్నం ప్రమీలాదేవికి పంపించిన మెయిల్‌లో వివరించారు. అనె్నం ప్రమీలాదేవి సోమవారం పార్లమెంటు ఆవరణలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను కలిసి తమ కుమార్తెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటూ కన్నీరు, మున్నీరు అయ్యారు. కరోనావైరస్ మహమ్మారిగా రాజ్యమేలుతున్న వూహాన్ నగరంలో దిన, దినగండంగా బతుకుతున్న తన కూతురును ఏ విధంగానైనా తీసుకురావాలంటూ ఆమె విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని వేడుకున్నారు. అనె్నం ప్రమీలాదేవి బాధనంతా సానుభూతితో విన్న జైశంకర్ తమ వైపు నుంచి ఎంత వీలుంటే అంత సహాయం చేస్తాం, అనె్నం జ్యోతికి వూహాన్ నగరంలో ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తాం, అన్ని విధాల ఆదుకుంటాం, వీలు కలిగిన మరుక్షణం ఆమెను స్వదేశానికి తరలిస్తామని హామీ ఇచ్చారు. జైశంకర్ ఆదేశం మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఆ తరువాత అనె్నం ప్రమీలాదేవికి ఒక మెయిల్ పంపిస్తూ తమ శాఖ ఇంత వరకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. చైనాలోని తమ రాయబార కార్యాలయం అనె్నం జ్యోతితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది, అమెకు స్వల్పంగా జ్వరం ఉన్నందుకే విమాన ప్రయాణానికి అనుమతి లభించలేదన్నారు. అనె్నం జ్యోతి ఎప్పటికప్పుడు భారతీయ రాయబార కార్యాలయం సిబ్బందితో సంప్రదింపులు జరుపుతూ ఉండేలా ఆమెను ప్రోత్సహించాలని ప్రమీలాదేవికి విదేశీ వ్యవహారాల శాఖ విజప్తి చేసింది.
చైనా అధికారులు వూహాన్ నగరాన్ని పూర్తిగా మూసివేశారు, వూహాన్ నగరంతో పాటు హుబే ప్రాంతం నుండి ఏ ఒక్కరినీ కూడా బైటికి వెళ్లనీయడం లేదని వెల్లడించారు. వూహాన్ నగరాన్ని పూర్తిగా మూసి వేయటం వల్లనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురాలేకపోతున్నామని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇదిలాఉంటే సోమవారం మధ్యాహ్నం వైసీపీ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత అనె్నం ప్రమీలాదేవిని పార్లమెంటు ఆవరణలో పరామర్శించారు. సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి అనె్నం జ్యోతిని ఆదుకునేలా చూస్తామని ఆమె అనె్నం ప్రమీలా దేవికి హామీ ఇచ్చారు.