జాతీయ వార్తలు

ఐక్యత, సమగ్రతను అందరూ గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, ఫిబ్రవరి 10: దేశ ఐక్యత, సమగ్రతను గౌరవించడం అన్నది ముఖ్యమైన ప్రాథమిక విధిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీనగర్‌లోని గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ(జీఎన్‌ఎల్‌యూ)లో ఏర్పాటైన ఓ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి మాజీ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ‘దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉంది. అయితే రాజ్యాంగానికి లోబడే నడచుకోవాలి’అని చెప్పారు. గొగోయ్ సొంత రాష్ట్రం అస్సాం నుంచి మొట్టమొదటి సారిగా సీఏఏపై నిరసనలు మొదలయ్యాయి. కొన్ని శక్తులు నిరసనల పేరుతో దేశ ఐక్యత, సమగ్రతలు హాని చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అస్సాంలో పరిస్థితులపై మాజీ సీజే మాట్లాడుతూ ‘ అస్సాంలో విద్యార్థి లోకం హింసాత్మక చర్యలకు స్వస్తిచెప్పిన మరుక్షణమే రాత్రికి రాత్రే శాంతి భద్రతలు అదుపులోకొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాథమిక విధుల్లో అత్యంత ముఖ్యమైనది దేశ ఐక్యత, సమగ్రతను గౌరవించడమేనని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో అనేక అంశాలుండగా సీఏఏను ప్రధాన అంశంగా చూపి నిరసనలు చేస్తున్నారని ఆయన అన్నారు.‘సీఏఏపై మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. నాకు ఓ అభిప్రాయం ఉండొచ్చు. మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కాకపోవచ్చు. అయినా అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ మీకు అలాగే నాకు ఉంది. చివరిగా ఏదైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి’ అని గొగోయ్ స్పష్టం చేశారు. సీఏఏను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. ‘న్యాయమూర్తులను విశ్వసించండి. రాజ్యాంగానికి లోబడే వారు నిర్ణయాన్ని ప్రకటిస్తారు’అని మాజీ ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. సీఏఏ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఆర్జేడీ నేత మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువామొయిత్రా, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖులు చేశారు. ‘నిరసనకారులు తమ అభిప్రాయం చెప్పడం వరకే..అంతే తప్ప సమాంతర వ్యవస్థను నడపడం సరైందికాదు’అని గొగోయ్ అన్నారు. సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లును డిసెంబర్ 18న సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీఏఏ చట్టబద్ధతపై పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సీఏఏ అమలుపై స్టేకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం దానికి ఉన్న రాజ్యాంగ బద్ధతపై విచారణకు అనుమతించింది. పౌరసత్వ సవరణ బిల్లుకు డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మొట్టమొదటిగా సీఏఏపై అస్సాం భగ్గుమంది. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లీంయేతర మతస్తులకు భారత పౌరసత్వం కల్పించటం చట్టం ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌లోకి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం అందించేలా చట్ట సవరణ చేశారు. అస్సాంలో సీఏఏ వ్యతిరేక ఉద్యమంపై రంజన్ గొగోయ్ మాట్లాడుతూ ‘ఉద్యమాల్లో విద్యార్థులు ఎంత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారో అస్సాంలోనే తొలిసారి నేను చూశాను’అని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు, అస్సాంలో జరుగుతున్న నిరసనలు భిన్నమైననవి ఆయన స్పష్టం చేశారు. అక్కడ అనేక సమస్యలు మిళితమైన ఉన్నాయని గొగోయ్ పేర్కొన్నారు.‘సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ తరువాత గౌహతి వెళ్లాను. నేను వెళ్లిన తరువాత సీఏఏ మంటలు అంటుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జోరు. ఐదు రోజుల్లోనూ నిరసనలు తార స్థాయి చేరుకున్నాయి.

*చిత్రం... సుప్రీం మాజీ సీజే గగోయ్