జాతీయ వార్తలు

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసన సభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి గెలుస్తోందంటూ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? లేక బీజేపీ నాయకులు వాదిస్తున్నట్లు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అనేది రేపు అంటే మంగళవారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి ఎవరు విజేతలనేది వెలుగులోకి వస్తుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తే, బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. గతంలో గుజరాత్ శాసన సభ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తలకిందులైనట్లే ఈసారి ఢిల్లీ ఎన్నికలపై జరిగిన ఎగ్జిట్
పోల్స్ వీగిపోతాయని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమోదించటం లేదు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ఫలితాల ప్రకటన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక బీజేపీ నాయకులు ఆశిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందుపై బీజేపీ అధికారంలోకి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ తప్పుల తడక, ఎగ్జిట్ పోల్స్ బండారం రేపు వెలుగులోకి వస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీకి చెందిన వివాదాస్పద నాయకుడు, మాడల్ టౌన్ నియోజకవర్గం అభ్యర్థి కపిల్‌శర్మ చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ ముస్లిం లీగ్ గా మారింది.. అందుకే ఢిల్లీకి చెందిన మెజారిటీ ఓటర్లు నిశ్శబ్దంగా బీజేపీకి ఓటు వేశారని ఆయన వాదిస్తున్నారు. కపిల్‌శర్మతో పాటు ఇతర బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నారు. బీజేపీ ప్రతి నియోజకవర్గంలో తన స్వంత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించుకున్నది, దీని ప్రకారం తాము సింపుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నామని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ముచ్చటగా మూడో సారి ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తోందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులకు ఏ మూలనో తమ గెలుపుపై కొంత అనుమానం కలుగుతోంది. అందుకే బీజేపీ నాయకులు ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేసే ప్రమాదం ఉన్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొందరు బీజేపీ నాయకులు ఓటింగ్ యంత్రాలను ఏక్కడికో తీసుకుపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లఘు వీడియోలను విడుదల చేశారు. ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేసేందుకు వాటిని తీసుకుపోయారన్నది వారి ఆరోపణ. అయితే ఢిల్లీ ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణలు, లఘు వీడియోలను తిరస్కరించింది. ఓటింగ్ యంత్రాలు భద్రంగా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలను ట్యాంపర్ చేయటం అసాధ్యమని వారు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విశ్వసించటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినంత దరిద్రంగా లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రేపు వెలువడే ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయని కాగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.