జాతీయ వార్తలు

రవిదాస్ బోధనలను జనంలోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: కులం, మతం ఆధారంగా వివక్ష లేని సమాజం కోసం 14వ శతాబ్దపు సాధువు రవిదాస్ కలలుగన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. సాధువు రవిదాస్ కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. రవిదాస్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం వారణాసిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రవిదాస్ బోధనలను విస్తృత ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని ఆమె కార్యక్రమంలో పాల్గొన్న వారికి పిలుపునిచ్చారు. ‘అతను (సంత్ రవిదాస్) కులం, మతం ప్రాతిపదికన వివక్ష లేని, ప్రతి ఒక్కరు గౌరవం పొందే సమాజం కోసం కలలుగన్నారు. మీరంతా కూడా ఆయన బోధనలను విస్తృత ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి. ప్రత్యేకించి సమాజంలో పెద్ద ఎత్తున హింస, ద్వేషం చోటు చేసుకుంటున్న ఈ సమయంలో అతని బోధనల ఆవశ్యకత ఎంతో ఉంది’ అని ప్రియాంకా గాంధీ అన్నారు. ‘సంత్ రవిదాస్ తన బోధనల్లో రామ్, రహీమ్ ఒక్కరేనని చెబుతుండేవారు. మనందరం భగవంతునిలో ఒక భాగం. మనం ఆయన బోధనలను నేర్చుకోవాలి’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ప్రియాంకా గాంధీ గురు రవిదాస్ జనమ్‌స్థాన్ మందిర్‌లో ప్రార్థన చేశారు. అలాగే లంగర్ (సామూహిక మధ్యాహ్న భోజనం)లో పాల్గొన్నారు. రవిదాస్ జయంతి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆమె ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు సహా పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అజయ్ కుమార్ లల్లు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంత్ రవిదాస్ బోధించిన సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం ఆవశ్యకత నేటికీ ఉందని అన్నారు.
*చిత్రం... వారణాసిలోని రఘుదాస్ ఆలయాన్ని ఆదివారం సందర్శించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ