జాతీయ వార్తలు

నో-ఎగ్జిట్... నో-ఎంట్రీ బోర్డు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 9: ‘మా పార్టీలో ముస్లిం నేతలనుద్ధేశించి నో-ఎగ్జిట్, నో-ఎంట్రీ అనే బోర్డులు ఏమీ పెట్టలేదు..’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. మధ్య ప్రదేశ్ బీజేపీ నుంచి ముస్లిం నాయకులు భారతీయ పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా పార్టీని వీడుతున్నారన్న ప్రచారాన్ని మంత్రి నఖ్వీ తోసిపుచ్చారు. తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్ళరాదని (నో-ఎగ్జిట్) బోర్డు పెట్టలేదని, ముస్లింలెవ్వరూ రాకూడదన్న (నో-ఎంట్రీ) బోర్డూ పెట్టలేదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో వారంతా మరోసారి సావధానంగా, ప్రశాంతంగా మనసుతో ఆలోచన చేయాలని ఆయన కోరారు. వారి అనుమానాలు, సందేహాలు ఏమీ ఉన్నా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, 100 శాతం ముస్లింలకు రక్షణ కల్పించేదని ఆయన చెప్పారు. బీజేపీ అతి పెద్ద పార్టీ అని ఆయన చెబుతూ పార్టీలో నో-ఎగ్జిట్, నో-ఎంట్రీ బోర్డులు ఏమీ లేవన్నారు. ఇష్టం లేని వారు ఎప్పుడైనా వెళ్ళవచ్చని, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు ఎప్పుడైనా పార్టీలో చేరవచ్చని ఆయన వివరించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఏఏను తీసుకుని వచ్చినట్లు ముస్లింలకు నచ్చజెప్పడంలో బీజేపీగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ విఫలమయ్యాయన్న వాదననూ ఆయన తిరస్కరించారు. ఎవరో కొంత మంది రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేస్తున్నారే తప్ప ముస్లింలు అందరికీ సీఏఏ గురించి అర్థం అయ్యిందన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటిని తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నఖ్వీ చెప్పారు. ఇదిలాఉండగా మధ్య ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ నుంచి సుమారు 80 మంది ముస్లిం నాయకులు సీఏఏకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు.