జాతీయ వార్తలు

20 ఉత్తమ స్మార్ట్ సిటీల్లో వారణాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి దేశంలోని ఎంపిక చేసిన వంద స్మార్ట్ సిటీలలో బాగా రాణిస్తున్న 20 నగరాలలో ఒకటిగా నిలిచింది. ఇక అమృత్‌సర్‌ను గాడిన పెట్టే బాధ్యతను ఇప్పుడు వారణాసి తీసుకోనుంది. అలాగే చండీగఢ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అహ్మదాబాద్ తీసుకోనుంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత ర్యాంకింగ్‌ల ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 20 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసింది. వీటి జాబితా ఇలా ఉంది. అహ్మదాబాద్ (తొలి ర్యాంకు), నాగ్‌పూర్, తిరుపూర్, రాంచీ, భోపాల్, సూరత్, కాన్పూర్, ఇండోర్, విశాఖపట్నం, వెల్లూరు, వడోదర, నాసిక్, ఆగ్రా, వారణాసి, దావణగెరె, కోట, పుణే, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, అమరావతి. అయితే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి పనితీరు కనబరుస్తున్న 20 స్మార్ట్ సిటీలను, బాగా వెనుకబడిన 20 స్మార్ట్ సిటీలతో జత చేసిందని ఒక అధికారి తెలిపారు. బాగా రాణిస్తున్న 20 నగరాలు, బాగా వెనుకబడిన 20 నగరాలు ఫిబ్రవరి 20లోగా పరస్పరం ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)ను కుదుర్చుకోవలసి ఉంటుంది. ఇలా రాంచీ సిమ్లాకు, పుణే ధర్మశాలకు సహకరించవలసి ఉంటుంది. ఒకే రకమయిన సంస్కృతి కలిగిన నగరాలను జతగా చేశారు. ఉదాహరణకు వారణాసి పుణ్యక్షేత్రం. కాబట్టి దాన్ని మరో పవిత్ర నగరం అమృత్‌సర్‌తో జత చేశారని ఆ అధికారి వివరించారు.