జాతీయ వార్తలు

ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన పోలింగ్ సరళిపై వివిధ టీవీ ఛానళ్ళు ప్రసారం చేసిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ విఫలమవుతాయని, శుద్ధ అబద్దం అని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోనున్నదని వారు ధీమాగా చెప్పారు. సర్వే చేసిన సంస్థలు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయని వారు విమర్శించారు. పైగా సాయంత్రం ఓటింగ్‌లో పాల్గొన్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ టీవీ ఛానళ్ళు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వెల్లడించాయని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మళ్లీ అధికారాన్ని చేపడుతుందని పేర్కొన్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించాలన్న తొందరే తప్ప లోతుగా అధ్యయనం చేయలేదని, పోలింగ్ ముగియడానికి రెండు గంటల ముందు మంచి పోలింగ్ జరిగిందని, దానిని ఈ టీవీ ఛానళ్ళు పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా, ఆ తర్వాత పుంజుకున్నదన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను పోలింగ్‌కు హాజరయ్యేలా చేశారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోనున్నారని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సోం మంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలు ఆదివారం పార్టీ ఢిల్లీ కార్యాలయంలో కూర్చొని పోలింగ్ సరళిపై అంచనా వేశారు. ఫలితాలు పార్టీకి అనుకూలంగా రానున్నాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.