జాతీయ వార్తలు

లంక తమిళులకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శ్రీలంకలో నివసిస్తున్న మైనారిటీ తమిళుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే అక్కడి ప్రభుత్వం కృషి చేయగలదన్న ఆశాభావాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. శ్రీలంక రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మైనారిటీ తమిళులకు సమానత్వం, న్యాయం, గౌరవం లభించగలవని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్షతో శనివారం విస్తృత చర్చల అనంతరం మాట్లాడిన మోదీ ‘శ్రీలంకలో ఉంటున్న మైనారిటీ తమిళుల సమస్యల గురించి ఎలాంటి అరమరికలు లేకుండా చర్చించాం. వీటి పరిష్కారానికి అక్కడి ప్రభుత్వం సరైన రీతిలో కృషి చేయగలదని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఉగ్రవాద నిరోధనలో సహకారం, వాణిజ్య, పెట్టుబడుల సంబంధాల విస్తరణ, సంయుక్త ప్రాజెక్టుల అమలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జాలర్ల సమస్యను మానవీయ కోణంలో నివృత్తి చేయడం సహా అనేక అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య విస్తృత చర్చ జరిగింది. శ్రీలంక అభివృద్ధిలో భారత్ ఎంతో విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని పేర్కొన్న మోదీ ఆ దేశ భద్రత, సుస్థిరత, అభివృద్ధి అన్నది తమకెంతో కీలకమని అన్నారు. లంకలో రాజకీయ సుస్థిరత అన్నది ఒక్క భారత్‌కే కాకుండా మొత్తం హిందూ మహాసముద్ర పరీవాహక ప్రాంతానికి కూడా ఎంతో ముఖ్యమని మోదీ ఉద్ఘాటించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లంక తమిళుల అంశాన్ని గట్టిగా ప్రస్తావించిన ఆయన శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలు చేయడం ఇందుకు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. దీని అమలు వల్ల లంకలోని మైనారిటీ తమిళులకు అన్ని రకాలుగాను అధికారాలు, హక్కులు సంక్రమిస్తాయని మోదీ అన్నారు. అక్కడ ఉంటున్న మైనారిటీ తమిళుల ఆకాంక్షలైన సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవాలకు ఎలాంటి విఘాతం కలుగదన్న నమ్మకాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఇందుకు సంప్రదింపుల ప్రక్రియను కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
1987లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. దక్షిణాసియా ప్రాంతానికి ఉగ్రవాదం ఓ పెను ముప్పుగా పరిణమిస్తోందని పేర్కొన్న మోదీ లంకలో గత ఏడాది జరిగిన ఈస్టర్ దాడులను ప్రస్తావించారు. ఈ రకమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు మరింతగా సహకారాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఇదే అంశాన్ని రాజపక్షతో జరిపిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించానని అన్నారు. జాలర్ల సమస్య ఎప్పటికప్పుడు తీవ్రమవుతున్న దృష్ట్యా దీనిని మానవీయకోణంలోనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల ఇరు దేశాల్లోని జాలర్లకు నేరుగానే అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నా రు. భారత్-శ్రీలంక మధ్య మత, సాంస్కృతిక, భాషాపరంగా శతాబ్దాల మైత్రీబంధం ఉందని మోదీ తెలిపారు. భద్రత లేదా ఆర్థిక వ్యవస్థ లేదా సామాజిక పురోగతిని తీసుకున్నా ఇరు దేశాల గతం అలాగే భవిత పరస్పర ఆధారితమైనవేనని మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజపక్ష పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మోదీ విధానానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా శ్రీలంకతో మైత్రికి భారత్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్ష ఉన్న కాలంలో శ్రీలంకతో మైత్రికి ప్రాధాన్యత లభించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధానిగా ఐదు రోజుల పర్యటనార్థం తాజాగా ఆయన భారత్‌కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
*చిత్రం... ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స