జాతీయ వార్తలు

ప్రి-లిటిగేషన్ మీడియేషన్‌ను తప్పనిసరి చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేయడానికి ముందు మధ్యవర్తిత్వ ప్రక్రియను ఆశ్రయించడాన్ని (ప్రి-లిటిగేషన్ మీడియేషన్) తప్పనిసరి చేస్తూ ఒక సమగ్ర చట్టాన్ని తీసుకు రావలసిన సమయం ఆసన్నమయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, అలాగే సంబంధిత పక్షాలకు, కోర్టులకు కేసులు అపరిష్కృతంగా ఉండే కాలం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ ఆయన మూడో అంతర్జాతీయ సదస్సులో ‘ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం’ అనే అంశంపై మాట్లాడారు. భారత్‌లో వ్యవస్థీకృత మధ్యవర్తిత్వం అభివృద్ధి చెందడానికి దృఢమయిన ‘ఆర్బిట్రేషన్ బార్’ ఎంతో కీలకమని, విజ్ఞానము, అనుభవము కలిగిన ప్రాక్టీషనర్లు అందుబాటులో ఉండటానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడుల గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నేడు మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమయిన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ సమాజంలో ఒక ముఖ్యమయిన సభ్యురాలిగా, ఒక వ్యాపార, పెట్టుబడుల దిగ్గజంగా భారత్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో కీలక పాత్ర పోషిస్తోందని జస్టిస్ బోబ్డే అన్నారు. ‘ఇటీవలి కాలంలో ప్రపంచీకరణ వల్ల భారత్ పాత్ర వహించిన సీమాంతర లావాదేవీలలో నాటకీయ వృద్ధి కనిపిస్తోంది. సీమాంతర మధ్యవర్తిత్వానికి డిమాండ్ పెరగడానికి ఇది దారితీసింది’ అని బోబ్డే అన్నారు.

*చిత్రం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే