జాతీయ వార్తలు

కుప్పకూలిన మూడంతస్తుల సౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛండీగడ్, ఫిబ్రవరి 8: పంజాబ్‌లోని మోహలీ జిల్లాలో మూడంతస్తుల వాణిజ్య భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు సైన్యం సహాయంతో శిథిలాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖరార్-లాండ్రన్ రోడ్డులో ఓ వాణిజ్య భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం కోసం జేసీబీ ద్వారా భారీగా తవ్వడం చేపట్టారు. అయితే అక్కడ భూమి తడిగా ఉండడం కారణం చేతనేమో వాణిజ్య భవనం కుప్పకూలింది. వాణిజ్య భవనం కూలడంతో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. అయితే శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.