జాతీయ వార్తలు

బ్యాచ్‌ల వారీగా ఓటేసిన మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ వద్ద నెలకుపైగా రోజుల నుంచి ఆందోళన చేస్తున్న మహిళా ప్రదర్శకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వల్ల శనివారం తమ ఆందోళనకు అంతరాయం కలుగకుండా ఉండటానికి బ్యాచ్‌ల వారీగా వెళ్లి ఓటు వేసి వచ్చారు. కొంతమంది మహిళలు ఉదయం, మరికొంత మంది మహిళలు మధ్యాహ్నం, ఇంకొంత మంది మహిళలు సాయంత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘ఇక్కడ ఉన్న ఇతర మహిళలు ఓటు వేయడానికి వెళ్లేందుకు నేను ఉదయం ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను ఓటు వేసి వచ్చాక ఇక్కడ (షహీన్‌బాగ్ వద్ద) వారితో కలిశాను. నేను ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేశాను’ అని ఓటు వేసి షహీన్‌బాగ్ నిరసన ప్రదేశం వద్దకు తిరిగి వచ్చిన మెహజాబీన్ ఖురేషి అన్నారు. బ్యాచ్‌ల వారీగా వెళ్లి ఓటు వేసి రావాలని తాము నిర్ణయించుకున్నామని షహీన్‌బాగ్‌కు చెందిన మరో మహిళ జహీదా ఖాన్ చెప్పారు. ‘ఇక్కడ ఆందోళన చేస్తున్న మేము కొంత మందిమి ఓటు వేయడానికి ఉదయం వెళ్లాలని, మిగతావారు ఇక్కడికి రావాలని, ఉదయం ఓటు వేసిన వారు ఇక్కడికి వచ్చాక మిగతా వారు ఓటు వేయడానికి వెళ్లాలని పోలింగ్‌కు ఒక రోజు ముందే నిర్ణయించుకున్నాం. సాయంత్రం వరకు మొత్తం మందిమి ఇక్కడ ఉండాలని, మా నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నాం’ అని ఆమె చెప్పారు.
ప్రజాస్వామ్యానికి ఓటు కీలకమని, అందువల్ల తామంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని జహ్రా షేక్ అనే మరో మహిళ తెలిపారు. ‘మాకు ఈ రోజు రెండింతల ప్రాధాన్యం గల రోజని తెలుసు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకున్నాం. అందువల్ల షహీన్‌బాగ్‌లోని ప్రతి ఒక్కరు ఓటు వేస్తున్నారు’ అని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, మహిళలు తమ ఇళ్లలో పనిచేసుకోవడానికి వెళ్లిన సమయంలో షహీన్‌బాగ్‌లోని పురుషులు నిరసన ప్రదర్శన స్థలం వద్ద ఉంటున్నారు.
*చిత్రం... ఢిల్లీలోని షహీన్‌బాగ్ ప్రాంతంలో ఉద్యమం కొనసాగింపు దెబ్బతినకుండా వంతుల వారీగా ఓట్లు వేసిన
ఆందోనకారులు. ఈ ప్రాంతంలో పౌరసత్వ చట్ట వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే