జాతీయ వార్తలు

ఐసీయూలో ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు, రాష్ట్రాలపై పెత్తనం వల్ల కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా గణనీయంగా పడిపోతోందని, దీనిని ముఖ్యమంత్రులు నిలదీయడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటాలో దాదాపు రూ.5 వేల కోట్ల మేర నిధులు ఆగిపోతాయన్నారు. ఇంత నష్టం జరుగుతున్నా, ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంటెన్సివ్ కేర్‌లో ఉందని, మునుపెన్నడూ లేనివిధంగా జీడీపీ దారుణంగా పడిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఆయన ముఫ్తంజాహ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐసీసీ రీసెర్చి డిపార్టుమెంట్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజ్యావతిరేకం, తిరోగమనమైనదని, పేదల ప్రయోజనాలను పూర్తిగా ధ్వంసం చేసేదిగా ఉందన్నారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణమన్నారు. ఈ రెండింటి వల్ల పరిశ్రమలు దేశంలోకి రావడం లేదని, పెట్టుబడులు నిలిచిపోయాయన్నారు. ఆర్థిక మంత్రి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలన్నారు. వ్యవసాయ గ్రామీణ భారతానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదన్నారు. బడ్జెట్‌లో ఆహార అవసరాలకు లక్ష కోట్లను తగ్గించడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను
బాగు చేయాలంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ సింగ్ లాంటి ఆర్థిక నిపుణుల సేవలు అవసరమన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో హేతుబద్ధ విధానాలకు తిలోదకాలిచ్చిందన్నారు. ఎనిమిదిన్నర లక్షల కోట్లకుగాను, ఆరున్నర లక్షల కోట్ల రూపాయలను పంచారన్నారు. మోదీ ప్రభుత్వం మనసులేని క్రూరమైన ప్రభుత్వమన్నారు. ఆయుష్మాన్ భారత్‌కు గత బడ్జెట్‌లో రూ.3,300 కోట్లు ఖర్చుపెట్టారని, దీనివల్ల లక్ష్యం నెరవేరుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలనే మూడ్‌ను పోగొట్టారన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. సామాన్య మానవుడి చేతిలో నగదు టర్నోవర్ అయ్యే విధంగా బడ్జెట్ ఉండాలని, అప్పుడే మార్కెట్ కళకళలాడుతుందన్నారు. 200 మంది ధనవంతులకు కార్పొరేట్ పన్నును తగ్గించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినిమయం, ఎగుమతుల రంగాల్లో అభివృద్ధిని పెంచాలన్నారు. దేశంలో వంద విమానాశ్రయాలు తెరవాలనుకుంటున్నారని, గత ఏడాది ప్రారంభించిన 50 శాతం విమానాశ్రయాల్లో విమానాలు తిరగడంలేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత లేకుండా చూడాలన్నారు. చివరకు బీజేపీ నేతలు కూడా బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు. గ్రామీణ భారతానికి ఊతం ఇచ్చే చర్యలేమీ కనపడలేదన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేసి ఎగుమతులు పెరిగేటట్లుచూడాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రస్తుత బడ్జెట్ తార్కాణమన్నారు. బ్రాండెడ్ కంపెనీ షోరూంలలో జనం తగ్గారన్నారు. కస్టమర్లు లేరంటే, జనం వద్ద డబ్బులు లేవని అర్థం చేసుకోవాలన్నారు. చాలామంది వాణిజ్యవేత్తలపై ఆదాయం పన్ను వేధింపులు పెరిగాయన్నారు. ఏ ఒక్క రంగంలో కూడా పన్నుల వసూళ్లు పూర్తిస్థాయిలో లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరకు కిసాన్ పథకాలకు కూడా కోతలు పెట్టిందన్నారు.

*చిత్రం... ఏఐసీసీ రీసెర్చి డిపార్టుమెంట్ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం