జాతీయ వార్తలు

‘ఇంటర్నెట్’ ప్రాథమిక హక్కుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఇంటర్నెట్ వినియోగించుకునే హక్కు ప్రాథమిక హక్కు కాదని, అది ఎంత మాత్రం దేశ భద్రతతో సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నది కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో ప్రకటన చేశారు. దేశ భద్రతా పరిస్థితులను కూడా అంతే ప్రాధాన్యతతో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రవిశంకర్ ప్రసాద్ ఇంటర్నెట్ హక్కు ప్రాథమిక హక్కేనని ఏ న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించలేదని తెలిపారు. ఈ రకమైన గందరగోళాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ‘మీ అభిప్రాయాలు, ఆలోచనలు తెలియజేయడం కోసం ఇంటర్నెట్ ఉపయోగించుకోవడమన్నది ప్రాథమిక హక్కే’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఉగ్రవాదం, హింసాకాండను ప్రేరేపించడానికి ఇంటర్నెట్‌ను వాడుకోవడాలు ఎవరూ సహించరని తెలిపారు. కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న ఇదేనని, ఇంటర్నెట్ కారణంగానే ఐఎస్‌ఐఎస్ బలపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ‘ఇంటర్నెట్‌ను వాడుకునే హక్కు ముఖ్యమైనదే. అలాగే దేశ భద్రత కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నది’ అని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారానే కాశ్మీర్‌లో అశాంతిని రగిలించే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. దేశ పౌరులు హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగం వాటి నియంత్రణపై కూడా దృష్టి పెట్టిందన్నారు. ‘ఇంటర్నెట్ ఉపయోగించుకోండి. అంతేగానీ, దాన్ని ఆధారంగా చేసుకొని హింసను సృష్టించవద్దు. దేశ సమైక్యత, సమగ్రత భద్రతకు విఘాతం కలిగించ వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.