జాతీయ వార్తలు

ఎవరికీ ముఖ్యమంత్రి అర్హత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత, యోగ్యత బీజేపీ నాయకుల్లో ఏ ఒక్కరికీ లేదని ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన గురువారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు ప్రకటించిన ఉచిత పథకాలను కొనసాగిస్తామని, అవసరమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్నింటిని ప్రవేశ పెడతామని తెలిపారు. అనధికార కాలనీల నిర్లక్ష్యం, షహీన్‌ళబాగ్ రహదారి సహా అనేక అంశాలపై బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి యోగ్యులైన అభ్యర్థులే దొరకలేదని పేర్కొన్న కేజ్రీవాల్ ‘సంబిక్ పాత్ర లేదా అనురాగ్ ఠాకూర్‌లు ముఖ్యమంత్రులైతే పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. అసలు బీజేపీ తరపున ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అభ్యర్థి ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. విద్వేష ప్రసంగం చేసినందుకు అనురాగ్ ఠాకూర్‌ను ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధించిందని, అలాగే ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో రెచ్చగొట్టే రీతిలో మాట్లాడినందుకు సంబిక్ పాత్రాకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని కేజ్రీవాల్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేశారు.
ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనక్కి తగ్గేది లేదని, తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడితే మరిన్ని ఉచిత పథకాలను అమల్లోకి తెస్తామని కేజ్రీవాల్ తెలిపారు. తమకు ప్రజలు మళ్లీ పట్టం కడితే ప్రధాన్యత పూర్వకంగా చేపట్టబోయే ఐదు పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గిస్తామని, రహదారుల డిజైనింగ్ మారుస్తామని, ఢిల్లీని స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామని, 24 గంటలు ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేస్తామని, అలాగే రవాణాను మెరుగుపరుస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. వివిధ అంశాల ప్రాతిపదికగా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించిన కేజ్రీవాల్ ఈ నెల 11న వెల్లడి కాబోయే ఫలితాలను బట్టి బీజేపీ ఏమేరకు విజయం సాధించిందో తేలిపోతుందన్నారు. పౌర చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై బీజేపీ కుల్లు రాజకీయాలు సాగిస్తోందని పేర్కొన్న ఆయన అసలు ఢిల్లీ ప్రజలను ఆ పార్టీ నాయకులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వరకు కూడా అనాధికార కాలనీల గురించి మరచిపోయిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఓట్ల కోసం వాటిని ప్రస్తావిస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశంలో ఓ కొత్త తరహా రాజకీయ సంస్కృతిని పాదుగొలుపుతాయని అన్నారు. మంచి పని చేసేవారినే మళ్లీ ఎన్నుకోవాలన్నది ఈ సరికొత్త రాజకీయ సంస్కృతి సారాంశమని తెలిపారు. ఇప్పటి వరకు ఓటు బ్యాంకు ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతొ వచ్చాయని, ఇక నుంచి గెలవాలంటే పనే పరమావధి అవుతుందని ఈ ఇంటర్వ్యూలో ఆయన ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను తాము అమలు చేయకపోవడానికి కారణం అని ఢిల్లీ ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించే కాకపోవడమేనని కేజ్రీవాల్ తెలిపారు.
*చిత్రం...ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్