జాతీయ వార్తలు

అవన్నీ ట్యూబ్‌లైట్లే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాన మంత్రిని ఆరు నెలల్లో అధిగమిస్తానంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించారు. నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ‘నన్ను ఆరు నెలల్లో అధిగమిస్తానని ఒక నాయకుడు ప్రకటించారు.. నిజమే నన్ను అధిగమించాలంటే వారు ఆరు నెలల పాటు కృషి చేయవలసిందే, వారికి ఆరు నెలల సమయం అవసరమని మోదీ వ్యాఖ్యానించారు. ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు వారు ముందే హెచ్చరించారు.. ఈ ఆరు నెలల్లో తాను ప్రతి రోజు చేసే సూర్య నమస్కారం వ్యాయామాన్ని మరింత ఎక్కువ చేసి పటిష్టపడతాను’ అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. ‘స్పీకర్ గారూ నేను దాదాపు ముప్పై, నలభై నిమిషాల నుండి మాట్లాడుతుంటే వారికి ఇప్పటికి కరెంటు వెళ్లింది, నిజమే.. కొన్ని ట్యూబ్‌లైట్లు ఇలాగే ఉంటాయి, చాలా మట్టుకు అన్ని ట్యూబ్‌లైట్లు ఇలాగే ఉంటాయి’ అంటూ రాహుల్ గాంధీని పనిచేయని ట్యూబ్‌లైట్‌తో పోలుస్తూ మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఏ ఒక్క నాయకుడు కూడా పూర్తి పటిష్టను సాధించలేడంటూ ఆయన మరోసారి రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. తాను చాలా కాలం నుండి ఇలాంటి తిట్లు వింటున్నాను, ఈ తిట్లను తట్టుకునేందుకు నాకు నేను ‘తిట్ల ప్రూఫ్’ చేసుకున్నానని నరేంద్ర మోదీ నవ్వుతూ ప్రకటించారు.
*చిత్రం...లోక్‌సభలో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ