జాతీయ వార్తలు

ఫిరాయింపులు అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాతృ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయించే అనైతిక ధోరణికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతో ఉందని,దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొనాలని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికి కోరారు. జీరో అవర్‌లో ఫిరాయింపుల అంశాన్ని డిఎంకె సభ్యుడు విల్సన్ ప్రస్తావించిన సందర్భంగా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడం ఎంతైనా అవసరమని, పార్టీలకు అతీతంగా సభ్యులందరూ దీనిపై దృష్టి పెట్టి సరైన పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. న్యాయస్థానాలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినందున ఫిరాయింపుల నిరోధనపై దృష్టి సారించడం చాలా ముఖ్యమని రాజ్యసభ చైర్మన్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో సభాపతులు, న్యాయస్థానాలు కూడా సమయం తీసుకుంటున్నాయని, ఈ నేపధ్యంలో తాము నిస్సహాయంగా ఉండాల్సి వస్తోందని అన్నారు. ఫిరాయింపుల నిరోధనపై లోతైన పరిశీలన జరపాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. సమాధానం ఇవ్వాలని తాను మంత్రిని కోరడం లేదని అయితే దీనిపై తగిన స్థాయిలో సరైన చర్యలు తీసుకునేలా చూడాలనే భావిస్తున్నానని అన్నారు.