జాతీయ వార్తలు

అయోధ్యకు దూరంగా మసీదుకు స్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, ఫిబ్రవరి 6: రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో ముస్లిం కక్షిదారులు గురువారం నాడిక్కడ మసీదు పునర్నిర్మాణానికి కేటాయించిన స్థలం అయోధ్య నగరానికి చాలా దూరంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి సుమారు 18 కిలో మీటర్ల దూరంలో లక్నో హైవే పరిసరాల్లో సోహావల్ తహసీల్ పరిధిలోని ధన్నిపూర్ గ్రామంలో అయిదెకరాల స్థలాన్ని మసీదు పునర్నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈమేరకు సున్ని వక్ఫ్ బోర్డ్‌కు అలాట్‌మెంట్ లెటర్‌ను అందజేసిందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ బుధవారం విలేఖరులకు తెలిపారు. అయోధ్య స్థల వివాదం కేసులో కక్షిదారు అయిన మొహమ్మద్ ఉమర్ గురువారం ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలం ప్రధానమయింది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్య పట్టణంలోని ఏదయినా ముఖ్యమయిన ప్రాంతాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాని, కేటాయించిన స్థలం నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో రోడ్డు కూడా లేకుండా ఉంది. అది ముఖ్యమయిన ప్రాంతం కాదు’ అని ఉమర్ అన్నారు. అయోధ్యలోని ముఖ్యమయిన ప్రాంతంలో స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, కాని, ఇప్పుడు కేటాయించిన స్థలం అయోధ్యలోనే లేదని, సోహావల్ తహసీల్ పరిధిలో ఉందని మరో కక్షిదారు హస్‌బుల్లా బాద్‌షా ఖాన్ పేర్కొన్నారు.