జాతీయ వార్తలు

నిరసన ప్రదర్శనల్లో పిల్లలను అనుమతించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: నిరసన ప్రదర్శనల్లో పిల్లలను అనుమతించవద్దని, ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేయాలని బ్రేవరీ అవార్డు విన్నర్ జెన్ సదావర్తే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు విజ్ఞప్తి చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జనవరి 30వ తేదీన జరిగిన ప్రదర్శనలో నాలుగేళ్ల మహమ్మద్ జహాన్ మృతి చెందిన విషయాన్ని ఆమె ఈ లేఖలో ప్రస్తావించింది. చిన్నారులను తీసుకొని నిరసన ప్రదర్శనలకు హాజరుకావడాన్ని ఈ ఏడవ తరగతి విద్యార్థిని సదావర్తే తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద బాలల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె ఆ లేఖలో సీజేకు విజ్ఞప్తి చేసింది. నిరసన ప్రదర్శనల్లో చిన్నారులు, పిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతున్నట్టు ఆమె ఆరోపించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేసింది. షహీన్‌బాగ్ సంఘటనలో మృతి చెందిన జహాన్‌కు నివాళులు అర్పించిన ఆమె ఆ చిన్నారిని నిరసన ప్రదర్శనకు తీసుకెళ్లిన అతని తల్లిదండ్రులు చేసిన నేరమని వ్యాఖ్యానించింది. ఆ పిల్లవాడి మృతికి కారణాలేవీ డెత్ సర్ట్ఫికెట్‌లో పేర్కోకపోవడాన్ని ఆమె తప్పుపట్టింది. పోస్టుమార్టం జరిపించి, మరణానికి గల కారణాలు పేర్కొంటూ మరణ ధృవీకరణ పత్రాన్ని మరోసారి జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. సుప్రీం కోర్టు ఈ దిశగా ఆదేశాలు జారీ చేస్తుందని విశ్వసిస్తున్నట్టు సీజేకు రాసిన లేఖలో సదావర్తే ఆశాభావం వ్యక్తం చేసింది.
**చిత్రం... బ్రేవరీ అవార్డు విన్నర్ సదావర్తే