జాతీయ వార్తలు

మహిళల కోసం కేంద్రం చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రధాని నరేంద్ర మోదీ పేద మహిళల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పథకాన్ని అమలు చేయకుండా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అక్రమాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ డి.అరవింద్ ఆరోపించారు. అరవింద్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ 71 వేల ఇళ్ల కోసం దాదాపు 200 కోట్ల రూపాయలను మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ముఖ్యమంత్రి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల కోసం ఇళ్ళ నిర్మాణం చేపట్టకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన సమాచారం కోరినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌ను రెండు సార్లు గెలిపించిన డబుల్ బెడ్ రూం పథకాన్ని కేసీఆర్ అమలు చేయటం లేదని, ఈ పథకం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలలోని అన్ని ప్రభుత్వాలు ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మాణం కొనసాగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేపట్టకుండా నిధులు మాయం చేస్తున్నదని అరవింద్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి మూలంగా తెలంగాణ క్షోభిస్తోంది, మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు 1600 కోట్ల రూపాయలు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తోందన్నారు. కేసీఆర్ దగుల్‌భాజీ ముఖ్యమంత్రి అని అరవింద్ ఆరోపించారు. 30 వేల ఇళ్లు నిర్మించినట్లు కేసీఆర్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని అరవింద్ ఆరోపించారు. ఆవాస్ యోజన నిధులతోనే ఆయన పార్టీ ప్రగతి భవన్‌ను నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.