జాతీయ వార్తలు

ఐదేళ్లలో రూ.35 వేల కోట్ల రక్షణ ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఐదేళ్ళలో రూ.35 వేల కోట్ల (5 బిలియన్ల) రక్షణ ఆయుధాల ఎగుమతులు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
బుధవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన 11వ మెగా డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రధాని మోదీ ప్రారంభించారు. కన్నుల పండువగా రక్షణ శాఖ విన్యాసాలు సాగాయి. ఒళ్ళు గగుర్పొడిచేలా సైనికులు తమ విన్యాసాలతో ప్రతిభను కనబరిచారు. హెలికాప్టర్ల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకర్షించాయి. ప్రదర్శనలో వివిధ రకాల ఆయుధాలనూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ వచ్చే ఐదేళ్ళలో ఐదు బిలియన్ డాలర్ల రక్షణ ఆయుధాల ఎగుమతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రక్షణ ఆయుధాల తయారీని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆయన వివరించారు. భారత దేశం పూర్తిగా దిగుమతులపై ఆధారపడదని అన్నారు. గత ఐదేళ్ళలో జారీ చేసిన రక్షణ లైసెన్సుల సంఖ్య పెరిగిందన్నారు. 2014లో 210 ఉంటే ఇప్పుడు 460కి చేరిందని ఆయన చెప్పారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు రక్షణ ఆయుధాలైన ఫిరంగి తుపాకులు, విమాన వాహకాలు, జలాంతర్గాములు, తేలికపాటి యుద్ధ విమానం, పోరాట హెలికాప్టర్ల తయారీ జరుగుతుండేదన్నారు. మేక్ ఇన్ ఇండియా, మన దేశంలోనే తయారుకావాలన్నదే తమ మంత్రమని అన్నారు. అప్పుడు రెండు వేల కోట్ల రూపాయల విలువ గల మన దేశ రక్షణ ఆయుధాలు ఎగుమతి అయ్యేవని ఆయన తెలిపారు. అయితే గత రెండేళ్ళలోనే ఎగుమతుల విలువ 17 వేల కోట్ల రూపాయలు చేరిందని, రానున్న ఐదేళ్ళ కాలంలో యుఎస్‌డీ 5 బిలియన్ల (అంటే రూ.35 వేల కోట్ల) విలువ చేసే ఆయుధాల ఎగుమతి జరగాలన్న లక్ష్యంతో ఉన్నామని ప్రధాని మోదీ వివరించారు.
ప్రపంచ మార్కెట్‌లో భారత్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ రక్షణ ఆయుధాల తయారీ రంగంలో భారత్‌లో హబ్‌గా ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం, ఉగ్రవాదం, సైబర్ నేరాలు పెరిగాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజలు అబ్బురపడేలా సైనికులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, శభాష్ అనిపించుకున్నారు.
*చిత్రం... లక్నోలో ఏర్పాటైన 11వ డిఫెన్స్ ఎక్స్‌పోను బుధవారం ప్రాఠంభించిన
తర్వాత తుపాకీ పనితీరును పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ