జాతీయ వార్తలు

రాజ్‌నాథ్ బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 5: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పలు దేశాల మంత్రులతో సమావేశమై, చర్చలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, మాల్దీవులు, కిర్గిస్తాన్, ఒమన్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. బ్రిటీష్ రక్షణ విభాగం సేకరణ మంత్రి జేమ్స్ హీపేతో భేటీ అనంతరం ఇరు దేశాల మైత్రీ సంబంధాలపై రాజ్‌నాథ్ ప్రస్తావించారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య ఎంతో అవగాహన ఉందని, ఈ పరస్పర సహకారం నిరాటంకంగా కొనసాగుతుందని ఆయన అభిలషించారు. ప్రత్యేకంగా రక్షణ శాఖకు సంబంధించిన ఉత్పత్తుల రంగంలో ఇరు దేశాలు వ్యూహాత్మకంగా నడవాలని ఆయన సూచించారు. మాల్దీవుల రక్షణ మంత్రి ఉజా మరియా అహమ్మద్ దీదీతోనూ రాజ్‌నాథ్ సమావేశమయ్యారు. కరోనా వైరస్ మొట్టమొదటిగా ప్రబలిన చైనాలో ఊహన్ నుంచి ఏడుగురు మాల్దీవుల విద్యార్థులను వెనక్కి రప్పించడంలో భారత్ చేసిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి భారతీయులతోపాటు ఈ విద్యార్థులను కూడా భారత్ అధికారులు ఊహన్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తరలించి, అక్కడ నుంచి మాల్దీవులకు పంపించారు. రక్షణ విభాగంలో రెండు దేశాల మధ్య అవగాహన మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా, మాల్దీవులకు రక్షణ విభాగంలో ఎలాంటి సహాయ సహకారాలకైనా భారత్ ముందుంటుందని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. ఇలావుంటే, కిర్గిస్తాన్ రక్షణ మంత్రి కల్నల్ ఎర్లిస్ టెర్డిక్‌బయేవ్‌తో సమావేశమైనపుడు ఇరు దేశాల్లోనూ సంయుక్త సైనిక విన్యాసాలు జరపాలని నిర్ణయించారు. సాధ్యమైంత త్వరలో ఈ రక్షణ విన్యాసాలు జరుగుతాయని వారు ప్రకటించారు. ఒమన్ రక్షణ మంత్రి బదర్ సౌద్ హరిబ్ అల్ బుసైదీతో రాజ్‌నాథ్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రక్షణ విభాగంలో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని వారు నిర్ణయించారు. రక్షణ సహకారమే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైనదని ఒమన్, భారత్ రక్షణ మంత్రులు వ్యాఖ్యానించారు. రక్షణ విభాగంలో భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వారు చెప్పారు.
*చిత్రం... లక్నోలో ఏర్పాటైన 11వ డిఫెన్స్ ఎక్స్‌పోను బుధవారం ప్రాఠంభించిన తర్వాత తుపాకీ పనితీరును పరిశీలిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్