జాతీయ వార్తలు

పౌర చట్టాన్ని రద్దు చేస్తే.. చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 28: వివాదాస్పద పౌరసత్వ చట్టంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ముందుగా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నంత మాత్రన అవి జాతి వ్యతిరేకం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ఆమె పునరుద్ఘాటించారు.
పెయింటింగ్‌ల ద్వారా పౌరసత్వాన్ని వ్యతిరేకించే కార్యక్రమం సందర్భంగా మంగళవారం మాట్లాడిన మమత ‘ఈ చట్టంపై చర్చలు ప్రారంభించడానికి మోదీ ముందుకు వస్తే అది సుహృద్భావ పరిణామం అవుతుంది’ అని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి చర్చలు జరపాలని స్పష్టం చేశారు. కాశ్మీర్, సీఏఏలపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిర్ణయాలను తీసుకునే ముందు అన్ని పార్టీలను సంప్రదించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ముందుకు పౌర చట్టాన్ని రద్దు చేస్తేనే అందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. దేశ ప్రజల విశ్వాసాన్ని ప్రధాని మోదీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉందని, అంతేకాదు సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని, అలాగే ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీల యోచనను కూడా వదులుకుంటామని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.