జాతీయ వార్తలు

దేశం.. త్రివర్ణమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత దేశం యావత్తు ఆదివారం త్రివర్ణమయమై శోభిల్లింది. 71వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అస్సాంలో, పది నిమిషాల వ్యవధిలోనే నాలుగు పేలుడు సంఘటనలను మినహాయిస్తే, గణతంత్ర వేడుకలు శాంతియుతంగానూ, అట్టహాసంగానూ జరిగాయి. జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత తొలిసారి ఇక్కడ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమేగాక, నాటి జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వేర్పాటువాదుల నుంచి సమస్యలు ఎదురవుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో, జమ్మూకాశ్మీర్ అంతటా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో, బహుల దశల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. గగనతలం నుంచి కూడా ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చర్యలు తీసుకున్నారు. వేలాది మంది సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, ముఖాన్ని రికార్డు చేసే పరికాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో డ్రోన్లు అనుక్షణం పహారా కాశాయి. గౌహతిలో అస్సాం గవర్నర్ జగదీష్ ముఖీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్థానికుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.15 నుంచి 8.25 మధ్య ప్రాంతంలో, ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్‌లో మూ డు, చరైడియోలో ఒకటి చొప్పున పేలుడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో రాష్టమ్రంతటా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిని ఉల్పా (ఇండిపెండెంట్) సంస్థ పనిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనల్లో ఎవరైనా మృతి చెందారా లేక గాయపడ్డారా అన్నది ఇంకా తెలియరాలేదు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు..
ముందుగా భయాందోళనలు చెందిన విధంగా అవాంఛనీయ సంఘటనలేవీ జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వౌలానా ఆజాద్ స్టేడియంలో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, జమ్మూలో లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన మార్చిపాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో పతాకాన్ని ఎగరేసిన తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నదని అన్నారు. అయితే, అక్షరాస్యతా శాతం నిరుత్సాహపరుస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం ఒక కార్యాచరణతో ముందుకు వస్తుందని ఆమె చెప్పారు. కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మసీదులు, చర్చిల్లో ప్రార్థన అనంతరం విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగరేసిన తర్వాత చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ ఉయ్‌కే మాట్లాడుతూ నక్సల్ సమస్య గణనీయంగా తగ్గిందని ప్రకటించారు. వౌలిక సదుపాయాలు మెరుగుపడి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నదని చెప్పారు. గుజరాత్‌లో రిపబ్లిక్‌డే సందర్భంగా జరిపిన మోటార్ సైకిల్ విన్యాసాలు, ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోర్‌బందర్ తీరంలో సీనియర్ సిటిజన్లు, కొంత మంది చిన్నారులు సముద్ర జలాల్లో నిల్చొని జాతీయ పతాకాన్ని ఎగిరేయడం విశేషం. ఉత్తర ప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులు యూనిఫామ్‌తో జరిపిన కవాతు అలరించింది. పారామిలటరీ దళాలు అద్భుత మార్చిపాస్ట్‌తో ఆహూతులను కట్టిపడేశాయి. తమిళనాడులో గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్, మేఘాలయలో ముఖ్యమంత్రి కన్‌రాడ్ సంగ్మా జాతీయ పతాకాలను ఎగురవేశారు. సంప్రదాయబద్ధంలో రాష్ట్ర గవర్నర్లే గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగరేస్తారు. కానీ, మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ప్రస్తుతం సెలవులో ఉండడంతో, ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సిక్కింలో గవన న్ గంగ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పలు అంశాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తమ ప్రసంగంలో చెప్పారు. కర్టానకలోని ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా పరేడ్ గ్రౌండ్స్‌లో కవాతు అద్భుతంగా జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పంజాబ్, హర్యానాసహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 71వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోలేదు.

'చిత్రం...రాజస్తాన్‌లో జాతీయ పతాకంతో విద్యార్థుల కవాతు