జాతీయ వార్తలు

తీరిక ఉంటే చదవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ‘పౌరసత్వ చట్టంలో పది లైన్లు చదవండి’ అంటూ ఇటీవల కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు కాంగ్రెస్ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ చురకలు వేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి దానిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు ‘ముందు చట్టంలోని పది లైన్లు చదవండి’ అంటూ బీజేపీ హితవు పలుకుతున్న సంగతి విదితమే. సమయం చూసి షాక్ ఇవ్వాలని అనుకుందో ఏమో కాంగ్రెస్ సరిగ్గా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏకంగా ఒక రాజ్యాంగ ప్రతిని ప్రధానమంత్రికి పంపింది. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న మీకు ఏమాత్రం తీరిక దొరికినా ఒకసారి ఈ రాజ్యాంగ ప్రతిని చదవండి’ అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి పంపింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ట్విటర్‌లో షేర్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తూ వస్తోందని ఇటీవలి కాలంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తోంది. ఈమేరకు రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో ‘డియర్ ప్రధాన మంత్రి గారూ.. త్వరలో రాజ్యాంగం కాపీ మీకు చేరబోతోంది.. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న మీకు ఏమాత్రం తీరిక దొరికినా ఓసారి దీనిని చదవండి.. -రిగార్డ్స్ కాంగ్రెస్’ అంటూ ట్విటర్ సందేశంలో మోదీకి కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పంపిన దానికి సంబంధించిన అమెజాన్ స్నాప్‌షాట్‌ను సైతం సెంట్రల్ సెక్రటేరియట్‌కు పంపిన సందేశంలో కాంగ్రెస్ నేతలు పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ అంశంలో కుల, మత, వర్గ వైషమ్యాలను పెంచి పోషిస్తోందని మరో ట్వీటర్‌లో బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ముఖ్యంగా ఇలాంటివన్నింటినీ ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొంది. ఏ రకంగానూ ప్రజలను వివక్షకు గురిచేయకూడదన్న ప్రధాన నిబంధనను బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు. కాగా, 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ పరిరక్షణకు లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దానిని కాలరాస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.