జాతీయ వార్తలు

సహకారం..మరింత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించడానికి భారత్, బ్రెజిల్ శనివారం 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బోల్సొనారో మధ్య శనివారం నాడిక్కడ చర్చలు జరిగిన అనంతరం ఇరు దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, పౌర విమానయానం, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, నవీకరణ రంగాలలో సహకారాన్ని పటిష్టం చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళికలో ఇరు దేశాలు నిర్దిష్టమయిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన భారత్, బ్రెజిల్ ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. చమురు, సహజవాయువు, ఖనిజ వనరులు, సంప్రదాయ ఔషధాలు, పశుసంవర్ధనం, జీవఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు సహా విస్తృత రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఈ 15 ఒప్పందాలు వీలు కల్పిస్తాయి. బోల్సొనారోతో చర్చల ఫలితాన్ని వివరిస్తూ ‘మీ భారత పర్యటన భారత్, బ్రెజిల్ మధ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది’ అని నరేంద్ర మోదీ అన్నారు. వివిధ ప్రపంచ అంశాలలో ఇరు దేశాలు ఒకే రకమయిన వైఖరిని కలిగి ఉన్నాయని పేర్కొంటూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయనే విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. బాల్సొనారో సమక్షంలో మోదీ తన మీడియా ప్రకటనలో ‘్భగోళిక వ్యత్యాసం ఉన్నప్పటికీ, భారత్, బ్రెజిల్ రెండూ కూడా వివిధ ప్రపంచ అంశాలపై కలిసే ఉన్నాయి. ఎందుకంటే, మా దృక్పథాలలో ఏకముఖత్వము ఉంది’ అని అన్నారు. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించేందుకు కొత్త మార్గాలపై దృష్టి కేంద్రీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న పటిష్ట సంబంధాలు తాజాగా కుదిరిన 15 ఒప్పందాల ద్వారా మరింత సంఘటితం అవుతాయని బాల్సొనారో అన్నారు.
'చిత్రం...ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చర్చల అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతున్న భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో