జాతీయ వార్తలు

జైట్లీ, సుష్మకు పద్మవిభూషణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సమాజ సేవ, కళలు, సాహిత్యం, క్రీడలు, సినిమా తదితర రంగాలలో విశేష కృషి చేసిన వారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, పదహారు మందికి పద్మ భూషణ్, 141 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులు స్వర్గీయ జార్జి ఫెర్నాండేజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బ్యాడ్‌మెంటన్ స్టార్ పీవీ సింధును పద్మ భూషణ్‌కు ఎంపిక చేశారు. పద్మ విభూషణ్ లభించిన వారు మాజీ కేంద్ర మంత్రులు స్వర్గీయ జార్జ్ ఫెర్నాండేజ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, స్వర్గీయ శ్రీవిశే్వష తీర్థ స్వామీజీ. పేజావర్ మఠం, ఉడిపి, భారత మూలాలకు చెందిన మారిషస్ మాజీ ప్రధాన మంత్రి అనిరుద్ జగన్నాథ్, ప్రముఖ ఒలంపిక్ బాక్సింగ్ చాంపియన్ సి.మేరీ కౌమ్. బీజేపీకి చెందిన కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్,
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, వేణు శ్రీనివాసన్, ఒలంపిక్ బ్యాడ్‌మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌సీ జమీర్, జమ్ము-కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ముజఫ్ఫర్ హుస్సేన్ బేగ్. కేరళకు చెందిన ముంతాజ్ అలీ, బంగ్లాదేశ్‌కు చెందిన సయ్యద్ వౌజెమ్ అలీ, బెంగాల్‌కు చెందిన అజయ్ చక్రవర్తి, మనోజ్ దాస్ (పాండిచ్చేరి), బాలకృష్ణ దోశి (గుజరాత్), కృష్ణమ్మాల్ జగన్నాథం-తమిళనాడు, అనీల్ ప్రకాశ్ జోషి-ఉత్తరాఖండ్, డాక్టర్ టిసేరింగ్ లాండోల్- లద్దాక్, నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్-కేరళ, ప్రొఫెసర్ జగదీష్ సేథ్-అమెరికా, పీవీ సింధు-తెలంగాణా, వేణు శ్రీనివాసన్-తమిళనాడు.
పద్మశ్రీ అవార్డు గ్రహితలు
గురు శశధర్ ఆచార్య-జార్కండ్, డాక్టర్ యోగి ఆయెరోన్-ఉత్తరాఖండ్, జయప్రకాశ్ అగర్‌వాల్-్ఢల్లీ, జగదీష్‌లాల్ అహుజా-పంజాబ్, కాజీ మసూమ్ అక్తర్-పశ్చిమ బెంగాల్, గ్లోరియా ఆరైరా-బ్రెజిల్, ఖాన్ జహీర్‌ఖాన్ బక్తియార్ ఖాన్- మహారాష్ట్ర, పద్మావతీ బందోపాధ్యాయ- ఉత్తర్‌ప్రదేశ్, సుశోవన్ బెనర్జీ-పశ్చిమ బెంగాల్, దిగంబర్ బెహెరా-చండీగడ్, దమయంతీ బెశ్రా-ఒడిశా, పోపట్‌రావ్ పవార్-మహారాష్ట్ర, హిమ్మత్‌రాం బంబు-రాజస్తాన్, సంజీవ్ బిక్‌చందనీ-ఉత్తరప్రదేశ్, గుఫూర్‌భాయి బిలఖియా-గుజరాత్, బాబ్ బ్లాక్‌మాన్-యునైటెడ్ కింగ్‌డమ్, ఇందిరా బోరా-అస్సాం, మదన్‌సింగ్ చౌహాన్-చత్తీస్‌గడ్, ఊషా చౌమర్-రాజస్తాన్, లిల్‌బహాదుర్ చత్రి-అస్సాం, లలిత, సరోజా చిదంబరం-తమిళనాడు, వజీరా చిత్రసేన- శ్రీలంక, పురుషోత్తమ్ దదీచ్-మధ్యప్రదేశ్, ఉత్సవ్ చరణ్‌దాస్-ఒడిశా, ఇందిరా దసనాయకె-శ్రీలంక, హెచ్‌ఎం దేసాయి-గుజరాత్, మనోహర్ దేవదాస్-తమిళనాడు, ఓబి దేవి-మణిపూర్, లియా డిస్కిన్- బ్రాజిల్, ఎంపి గణేష్-కర్నాటక, బెంగళూరు గంగాధర్-మహారాష్ట్ర, రామన్ గంగాకేడ్కర్-మహారాష్ట్ర, బెర్రి గార్డనర్-యు.కె, చవాంగ్ మోతప్ గోబా-లద్దాక్,్భరత్ గోయెంకా-కర్నాటక, యడ్ల గోపాలరావు-ఆంధ్రప్రదేశ్, మిత్రభాను గొంతియా- ఒడిశా, తులసి గొడ-కర్నాటక, సుజోయ్ గుహా-బిహార్, హరికెలా హజబ్బ-కర్నాటక, యెనాముల్ హక్-బంగ్లాదేశ్, మధు మనుసూరి-జార్కండ్, అబ్దుల్ జబ్బార్-మధ్యప్రదేశ్, బిమల్‌కుమారి జైన్-బీహార్, మీనాక్షి జైన్, నేమ్నాథ్ జైన్, శాంతిజైన్-బీహార్, సుధీర్ జైన్-గుజరాత్, బేనిచంద్ర జమాతియా-త్రిపుర, సంపత్ కుమార్, విదూషి జయలక్ష్మి-కర్నాటక, కరణ్‌జోహార్-మహారాష్ట్ర, లీలాజోషి-మధ్యప్రదేశ్, సరితా జోషి-మహారాష్ట్ర, సి. కమలోవా-మిజోరం, రవికన్నన్-అస్సాం, ఏక్తాకపూర్-మహారాష్ట్ర, యజ్డి నౌషిర్‌వాన్ కరంజియా-గుజరాత్, నారాయణ జోషి-గుజరాత్, నరీంద్రనాథ్ కన్నా-ఉత్తర్‌ప్రదేశ్, నవీన్ ఖన్నా-్ఢల్లీ, ఎస్‌పీ కోథారి- అమెరికా, మునుస్వామి-పాండిచ్చేరి, ఎంకె కుంజోల్-కేరళ, మన్మోహన్ మహాపాత్ర-ఒడిశా, ఉస్తాద్ అన్వర్‌ఖాన్-రాజస్తాన్, కత్తుంగల్ సుబ్రమణ్యం మణిలాల్- కేరళ, మున్నామాస్టర్-రాజస్తాన్, ఆధిరాజ రాజేంద్ర మిశ్రా-హిమాచల్ ప్రదేశ్, బినపని మోహంతీ-ఓడిశ్శా, అరుణోదయ్ మండల్- పశ్చిమ బెంగాల్, పి.ముఖర్జీ-ఫ్రాన్స్, సత్యనారాయణ ముండయూర్-అరుణాచల్ ప్రదేశ్, మణీలాల్ నాగ్-పశ్చిమ బెంగాల్, చంద్రశేఖరన్ నాయర్-కేరళ, తెత్సు నగమూరా-అఫ్గానిస్తాన్, శివదత్ నిర్మోహి- జమ్ముకాశ్మీర్, పిఎల్ పచువా-మిజోరం, మూజిక్కల్ పంకజాక్షి- కేరళ, ప్రశాంత్‌కుమార్ పట్నాయక్- అమెరికా,జోగీంద్రనాథ్ ఫుకన్-అస్సాం, రాణిబాయి సోమాపోప్రే-మహారాష్ట్ర, యోగేష్ ప్రవీణ్-ఉత్తర్ ప్రదేశ్, జీతూ రాయ్-ఉత్తర్ ప్రదేశ్, తరుణ్‌దీప్ రాయ్-సిక్కిం, ఎస్.రామకృష్ణన్-తమిళనాడు, రాణి రాంఫాల్-హర్యానా, కంగనా రనౌత్-మహారాష్ట్ర, దలవాయి చలపతిరావు-ఆంధ్రప్రదేశ్, శాబుద్దీన్ రాథోడ్-గుజరాత్, కళ్యాణ్‌సింగ్ రావత్-ఉత్తరాఖండ్, చింతల వెంకట్ రెడ్డి-తెలంగాణా, శాంతిరాయ్-బిహార్, రాధామోహన్, సబర్మతీ-ఒడిశా, బాతకృష్ణ సాహూ-ఓడిశ్శా, ట్రినిటీ సైఊ-మేఘాలయ్.

*మాజీ కేంద్ర మంత్రులు స్వర్గీయ అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ (ఫైల్‌ఫొటోలు)