జాతీయ వార్తలు

‘నిర్భయ’ తీర్పునిచ్చిన న్యాయమూర్తి బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష విధించిన ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి సతీష్‌కుమార్ అరోరా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి బదిలీ అయ్యారు. 2012 నాటి నిర్భయ కేసులో సంచలన తీర్పునివ్వడం ద్వారా అరోరా పేరు వార్తల్లోకి ఎక్కింది. అరోరాను సుప్రీం కోర్టుకు అడిషనల్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. ఏడాది పాటు ఆయన డిప్యుటేషన్‌పై అక్కడ పనిచేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి పటియాల హౌస్ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చారు. అడిషనల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా నిర్భయ కేసుతో పాటు పలు కీలక కేసులు విచారించారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నమోదు చేసిన కేసు విచారించారు. ఇప్పుడా కేసును కొత్తగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తికి అప్పగిస్తారు. పటియాలా జిల్లా కోర్టుకు అందిన లేఖలో ‘అడిషనల్ సెషన్స్ జడ్జి అరోరాను తక్షణం రిలీవ్ చేయండి’అని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో ఏడాది పాటు డిప్యుటేషన్‌పై అడిషనల్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తారని లేఖలో పేర్కొన్నారు. అరోరాను వెంటనే బదిలీ చేస్తే కొత్త బాధ్యతలు అప్పగించడానికి వీలుంటుందని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. సతీష్‌కుమార్ అరోరా చివరిగా ఇచ్చిన తీర్పు నిర్భయ కేసే. వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31), ముకేష్ కుమార్ సింగ్(26), పవన్(25)కు ఆయన ఉరి శిక్ష విధించారు. నలుగురు దోషులను ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి తీస్తారు. 2012 డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థిని(23) సామూహిక అత్యాచారానికి గురయింది. ఆమెపై తెగబడిన దుర్మార్గులు అత్యంత క్రూరంగా హింసించారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన ఆరుగురు మృగాలు నడుస్తున్న బస్సులోంచి తోసేశారు. దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేషాలు వెల్లువెత్తాయి.