జాతీయ వార్తలు

లౌకికదేశం భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతీయ విలువలు అన్ని మతాలను సమానంగా భావిస్తాయని, అందువల్లనే భారత్ లౌకిక దేశంగా కొనసాగుతోందని, ఎన్నడు కూడా పాకిస్తాన్ వలె మతాధికారి పాలిత దేశంగా మారలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం నాడిక్కడ ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ 2020లో ఆయన మాట్లాడుతూ ‘మనము (్భరత్) మతాల మధ్య వివక్ష ప్రదర్శించబోమని చెప్పాము. మనం అలా ఎందుకు చేశాము? మన పొరుగు దేశం తనను తాను మతపరమయిన రాజ్యంగా ప్రకటించుకుంది. వారు తమది మతాధికారి పాలిత దేశంగా ప్రకటించుకున్నారు. మనం అలా ప్రకటించలేదు’ అని అన్నారు. ‘అమెరికా కూడా మతపరమయిన పాలిత దేశమే. భారత్ మతపరమయిన పాలిత దేశం కాదు. ఎందుకు? మన సాధువులు, సంతులు మన దేశ సరిహద్దుల లోపల ఉన్న వారినే కాకుండా ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగానే భావించారు’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ ఎన్నడు కూడా తన మతం హిందూ, సిక్కు లేదా బౌద్ధం అని ప్రకటించుకోలేదు. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసించవచ్చని ఆయన అన్నారు. ‘వారు (సాధు సంతులు) ‘వసుదైక కుటుంబం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే నినాదం ఇచ్చారు. ఈ సందేశం ఇక్కడి నుంచే ప్రపంచమంతా విస్తరించింది’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఎన్‌సీసీ కేడెట్లకు ‘రక్షణ మంత్రి పతకాలు, ప్రశంసాపత్రాల’ను ప్రదానం చేశారు. కేడెట్లు ప్రదర్శించిన బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎన్‌సీసీ కేడెట్లు ప్రదర్శించిన కవాతు, వివిధ రకాల కార్యక్రమాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. ఎన్‌సీసీ (నేషనల్ కేడెట్ కోర్స్) భారతీయ యువతలో దేశాభిమానాన్ని పెంపొందిస్తూ వస్తోందని ఆయన కొనియాడారు.

'చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో సైనిక గౌరవ వందనం స్వీకరిస్తున్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్