జాతీయ వార్తలు

49 సాహస బాలలకు బాలశక్తి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన, సాహస బాలలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల శక్తి పురస్కారాలు) అందజేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 5-18 ఏళ్ల మధ్యవయస్కులైన 49 మంది పిల్లలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
దోపిడీ దొంగల బారి నుంచి ఓ రష్యన్ టూరిస్టును కాపాడిన ఇషాన్ శర్మ, యువ రచయిత, ప్రపంచ రికార్డు గ్రహీత ఓంకార్ సింగ్, యువ పియానిస్టు గౌరి మిశ్రా సహా 49 మందికి బాల శక్తి పురస్కారం-2020 దక్కింది. కొత్త ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పిల్లలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందచేశారు. అవార్డులు అందుకున్న 49 మంది బాలల్లో 12 ఏళ్ల దర్శ్ మలానీ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 మ్యాజిక్ షోలు ఇచ్చిన దర్శ్ రికార్డు సృష్టించారు.
అలాగే మనోజ్ కుమార్ లోహర్(11) తబలా కళాకారుడు. అతడికి బాల శక్తి పురస్కారం లభించింది. ‘యంగెస్ట్ పియానిస్టు ఇండియా’ గౌరీ మిశ్రాకు రాష్టప్రతి అవార్డు అందించారు. 15 ఏళ్ల ఇషాన్ శర్మ ఇద్దరు దొంగల బారి నుంచి ఓ మహిళా రష్యన్ టూరిస్టును కాపాడాడు. పోలీసులకు సకాలంలో సమాచారం అందించి దొంగలను పట్టుకునేందుకు శర్మ సహకరించాడు. అతనికి బాల శక్తి పురస్కారం దక్కింది. మణిపూర్ నీట్లో కొట్టుకుపోతున్న ముగ్గురు బాలికల ప్రాణాలకు కాపాడిని పదేళ్ల లాల్‌కన్‌సంగ్‌కు అవార్డు అందజేశారు. అలాగే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన పేమకు రాష్టప్రతి పురస్కారం ప్రదానం చేశారు. వర్షాలకు పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయి దాని కింద చిక్కుకున్న ఇద్దరు బాలికలను ఆమె రక్షించారు.