జాతీయ వార్తలు

మాంద్యంతో కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: దేశంలో ఆర్థిక మాంద్యం రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోందని, దీంతో కరువు, ఆకలిచావులు తప్పవని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాంద్యం కారణంగా నిరుద్యోగిత కూడా దేశంలో విపరీతంగా పెరిగిపోతోందని ఆయన యూత్ కాంగ్రెస్ సభలో పాల్గొని ప్రసంగిస్తూ అన్నారు. ప్రజల దృష్టిని ఆర్థిక మాంద్యం నుంచి తప్పించేందుకే ప్రభుత్వం పలు అంశాలను తెరపైకి తెస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక మాంద్యం వల్ల దేశ పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోందని, కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా తాత్సారం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగిత పెరుగుతున్నకొద్దీ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన అన్నారు. దోపిడీలు, దొంగతనాలు, చివరకు మానభంగాలకు కూడా నిరుద్యోగిత ఒక కారణమని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆయన మరోసారి సవాల్ విసిరారు. బీజేపీకి మద్దతు ఇస్తోందన్న పేరుతో పరోక్షంగా తమ తమ సిద్ధాంతాలను దేశంపై రుద్దడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈనెల 28న జైపూర్‌లో జరిగే రాహుల్ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరు కావాల్సిందిగా ఆయన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.