జాతీయ వార్తలు

ప్రాజెక్టుల జాప్యంపై ప్రధాని మోదీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంకా పూర్తికాని తొమ్మిది ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష జరిపారు. ఈ ఏడాది మొట్టమొదటిసారి జరిగిన ‘ప్రగతి’ని ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన తన మంత్రివర్గ సహచరులతో వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 24వేల కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మూడు రైల్వే శాఖకు చెందినవి కాగా, ఐదు రోడ్డు రవాణా, జాతీయ రహదారులకు సంబంధించినవి, ఒక ప్రాజెక్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధించినది. వీటితోపాటు వివిధ బీమా పథకాలను కూడా ప్రధాని సమీక్షించారని సమాచారం. ‘ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ‘ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎసీబీవై)’ పనితీరును ఆయన తెలుసుకున్నారు. అంతేకాకుండా నేరాలు, నేరస్థుల గుర్తింపు కోసం ఉపయోగించే నెట్‌వర్క్ ప్రాజెక్టుల సమాచారాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అత్యధిక సేవలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలావుంటే, మొత్తం 31 ప్రగతి సమావేశాలను మోదీ ఇప్పటివరకు నిర్వహించారు. 12.30 లక్షల కోట్ల విలువైన 269 ప్రాజెక్టుల వివరాలను సమీక్షించారు. అదేవిధంగా 17 వేర్వేరు రంగాలకు సంబంధించి 47 ప్రభుత్వ కార్యకలాపాలపై అందిన పలు ఫిర్యాదులను కూడా ఆయన పరిశీలించారు. తాజా సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధాని దృష్టి కేంద్రీకరించారు.