జాతీయ వార్తలు

రైళ్లలో కేరళ ఘుమఘుమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచి, జనవరి 22: నోరూరించే అప్పం, పుట్టు, ఎగ్-కర్రీ, కడాల కర్రీని ఆస్వాదించాలంటే రైళ్ళలో ప్రయాణించాల్సిందే. సాంప్రదాయ వంటకాలు రైళ్ళలో ఉండడం లేదన్న కేరళవాసుల నిరసనల అనంతరం ఘుమఘుమలాడే కేరళ వంటకాలనూ అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చి ‘మేను’ను మార్చింది. దీంతో రైలు ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైలు ప్రయాణికులకు కేరళ పేరేన్నికగన్న వంటకాలను అందించడం లేదని కేరళ వాసులు చాలా కాలంగా నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ వంటకాల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇంకా ఎర్నాకులం ఎంపీ హిబి ఎడెన్ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు తాజాగా లేఖ రాశారు. దీంతో మంత్రి పియూష్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అధికారులతో చర్చించగా, వాటిని మేనులో చేర్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఉన్నియప్పం, సుఖియన్ వంటలను కూడా చేరుస్తామని అధికారులు తెలిపారు. ఐఆర్‌సీటీసీ అధికారులు బుధవారం తన నివాసానికి వచ్చి రైలు ప్రయాణికులకు అందిస్తున్న వంటల జాబితాను తనకు చూపించారని ఎంపీ ఎడెన్ చెప్పారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మలయాళీలు ఇష్టపడే అల్పాహారం అప్పం చేర్చాలని కోరారు. ఇంకా ఎగ్-కర్రీ, పొరొట్టా, దోశ, స్టీం కేక్ (పుట్టు), బనానా ఫ్రై (్ఫజం పొరి), ఖోజుక్కట్ట, ఉన్నియప్పం, నెయ్యప్పం, సుఖియాన్‌ను మేను నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. తినుబండారాలపై ధరలు పెంచడం పట్ల కూడా ఎంపీ ఎడెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
భోజనం రూ.35 ఉండగా రూ.70కి పెంచారని, అల్పాహారంగా తినే వడపైనా రూ.8 నుంచి రూ.15కి పెంచారని ఆయన తెలిపారు. ఇలాఉండగా ప్రయాణికులకు రూ.20కే ఉన్నియప్పం/సుఖియన్/నెయ్యప్పం అందిస్తామని ఐఆర్‌సీటిసి అధికారులు చెప్పారు.